Shocking: నడిరోడ్డుపై నల్లబ్యాగ్ కలకలం.. బ్యాగ్‌లో నుంచి ఏడుపు శబ్దం.. బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా...

బ్యాగ్‌ ఓపెన్ చేసి చూస్తున్న దృశ్యం

హర్యానాలోని ఫరీదాబాద్ ప్రాంతం. ఫరీదాబాద్‌లో ఉన్న ఓ బ్రిడ్జిపై గుర్తుతెలియని ఓ బ్యాగ్ ఆ బ్రిడ్జిపై వచ్చిపోయే వారిని కలవరపాటుకు గురిచేసింది. గంటలు గడుస్తున్నా ఆ బ్యాగ్ బ్రిడ్జి పైనే కనిపించడం, బ్యాగ్‌లో నుంచి చిన్న పిల్ల ఏడుపు వినిపించడంతో ఓ వ్యక్తి అనుమానం వచ్చి బ్యాగ్ తీసి చూశాడు. బ్యాగ్‌లో నవజాత శిశువు కనిపించింది.

  • Share this:
    ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్ ప్రాంతం. ఫరీదాబాద్‌లో ఉన్న ఓ బ్రిడ్జిపై గుర్తుతెలియని ఓ బ్యాగ్ ఆ బ్రిడ్జిపై వచ్చిపోయే వారిని కలవరపాటుకు గురిచేసింది. గంటలు గడుస్తున్నా ఆ బ్యాగ్ బ్రిడ్జి పైనే కనిపించడం, బ్యాగ్‌లో నుంచి చిన్న పిల్ల ఏడుపు వినిపించడంతో ఓ వ్యక్తి అనుమానం వచ్చి బ్యాగ్ తీసి చూశాడు. బ్యాగ్‌లో నవజాత శిశువు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని బ్యాగ్‌లో ఏముందని చూడగా.. ఆ బ్యాగ్‌లో నవజాత శిశువు ఏడుస్తూ కనిపించింది. పోలీసులు బ్యాగ్‌లో చిన్న పాప ఉండటం చూసి షాకయ్యారు. ఎవరో బిడ్డను కని ఇలా నడిరోడ్డుపై బ్యాగులో ఉంచి వెళ్లిపోయారని తేల్చారు.

    ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అది ఫరీదాబాద్‌లోని సెక్టార్ 25 రోడ్డులో ఉన్న బ్రిడ్జి. ఉదయాన్నే మహేష్ అనే ఒక పాదచారుడు బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అలా వెళుతున్న అతనికి రోడ్డు పక్కన ఒక నల్లని బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగులో నుంచి ఓ చిన్న పాప ఏడుస్తున్న శబ్దం అతనికి వినిపించింది. ఒక్కసారిగా అతను కంగు తిన్నాడు. బ్యాగ్ దగ్గరకు వెళ్లి చూశాడు. బ్యాగ్‌లో నుంచే ఆ ఏడుపు వినిపిస్తున్నట్లు నిర్ధారించుకున్నాడు.

    బ్యాగ్ తెరిచి చూశాడు. ఆ నల్ల బ్యాగ్‌లో నవజాత శిశువును చూసి మహేష్ షాకయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని బ్యాగ్‌ను పరిశీలించగా.. బ్యాగ్‌లో పాప కనిపించింది. పోలీసులు ఆ పాపను వెంటనే ఫరీదాబాద్‌లోని బాద్షా ఖాన్ హాస్పిటల్‌కు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి కొన్ని గంటల క్రితం పుట్టిన పాపను బ్యాగ్‌లో పెట్టి అక్కడ పడేసి వెళ్లిపోయి ఉండొచ్చని పోలీసులు చెప్పారు. పాప ఒంటిపై కనీసం దుస్తులు కూడా లేవని తెలిపారు.

    ఇది కూడా చదవండి: Married Woman: భర్త గురించి పచ్చి నిజం తెలిసి గుండె పగిలినంత పనయింది.. చివరకు ఏం జరిగిందంటే..

    మహేష్ అనే వ్యక్తి పాపను స్థానికంగా ఉన్న ఓ మహిళకు ఇవ్వగా.. ఆమె బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చిందని పోలీసులు చెప్పారు. ఆ పాపను అక్కడ వదిలేసి వెళ్లింది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఆ నవజాత శిశువును అలా వదిలేసి వెళ్లిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని, పాప ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని పోలీసులు చెప్పారు. ఇదిలా ఉండగా.. నడిరోడ్డుపై పాపను అలా బ్యాగ్‌లో వదిలేసి వెళ్లారనే విషయం తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆ పాపను దత్తత తీసుకునేందుకు పలువురు ముందుకొచ్చారు. అయితే.. న్యాయపరమైన ప్రక్రియ ఉంటుందని, ఇప్పటికిప్పుడు పాపను అలా దత్తత తీసుకునే అవకాశం లేదని పోలీసులు వారికి తెలిపారు. పాపను దత్తత తీసుకునే అవకాశం లేదని చెప్పడంతో ఆ చిన్నారిని దత్తత తీసుకుందామని అక్కడికి వచ్చిన కొందరు తీవ్ర నిరాశ చెందారు.
    Published by:Sambasiva Reddy
    First published: