లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమేనని నిర్థారణ... సీనియర్ పోలీస్ ఆఫీసర్ సస్పెన్షన్

తమిళనాడులోని నాగపట్టినంలో DSPగా వ్యవహరించిన ఎస్.వెంకట్రామన్‌ ఎప్పుడో సస్పెండ్ అవ్వాలనీ... చాలా ఆలస్యంగా యాక్షన్ తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 2, 2019, 1:45 PM IST
లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమేనని నిర్థారణ... సీనియర్ పోలీస్ ఆఫీసర్ సస్పెన్షన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
2015లో సబార్డినేట్ మహిళా ఆఫీసర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ ఎస్.వెంకట్రామన్‌ను విధుల నుంచీ తప్పించింది తమిళనాడు ప్రభుత్వం. ఆయన నాగపట్టినం డివిజన్‌లో DSPగా వ్యవహరిస్తున్నారు. లైంగిక ఆరోపణల కేసు నమోదైనప్పుడు వెంకట్రామన్... అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ASP)గా త్రిచీలోని ఇంటెలిజెన్స్ యూనిట్‌లో పనిచేసేవారు. మహిళా ఎస్సై భర్త... తన భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వెంకట్రామన్‌పై కేసు పెట్టారు. ఈ కేసు తర్వాత వెంకట్రామన్‌ను త్రిచీ నుంచీ కన్యాకుమారి లోని కొలాచల్‌లో DSPగా నియమించారు. ఈ ఆరోపణలు నిజమేనని తేల్చారు పెరంబలూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దిశా మిట్టల్ IPS. ఆమె ఈ కంప్లైంట్‌పై దర్యాప్తు చేశారు. ఆమె ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తమిళనాడు ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి నిరంజన్ మర్డీ... వెంకట్రామన్‌పై సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేశారు.

పోలీసులు చెబుతున్నదాన్ని బట్టీ వెంకట్రామన్‌ వేధింపులకు పాల్పడినట్లు బలమైన ఆధారాలున్నాయి. అప్పట్లో బాధితురాలితో లైంగిక పరమైన కామెంట్లు చేశారు వెంకట్రామన్. వాటిని ఆమె రికార్డ్ చేశారు. ఆమెను తనకు వ్యక్తిగత సేవలు చేసిపెట్టమని, అలా చేస్తే... డ్యూటీలో కలిసొచ్చేలా చేస్తానని వెంకట్రామన్ అన్నట్లు ఆడియో రికార్డులున్నాయి.

ఇంత పక్కాగా ఆధారాలున్నా ఈ కేసు దర్యాప్తు 4 ఏళ్లు ఎందుకు పట్టిందన్న ప్రశ్నకు కారణం... ప్రభుత్వ పాలనా యంత్రాంగమే అంటున్నారు పోలీసులు. కేసు నమోదైనప్పుడే ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి కూడా... వెంకట్రామన్‌పై చర్యలు తీసుకోలేదు. ఆమె రిటైరైన తర్వాత... 2017లో ఈ కేసును ఎస్పీ దిశా మిట్టల్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.

బాధితురాలి భర్త దర్యాప్తులో తమకు సహకరించలేదనీ, చాలాసార్లు అడిగిన తర్వాత... ఆమె స్వయంగా వచ్చి బలమైన స్టేట్‌మెంట్ ఇచ్చారని పోలీసులు అంటున్నారు. ఏప్రిల్‌లో ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించగా... మూడు నెలల తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు