• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • SENIOR GOVERMENT OFFICER TRAP THE YOUNG WOMEN CANCELLED THE ENGAGEMENT INCIDENT AT VIKARABAD CASE FILE VB

Telangana: ఆ పిల్ల నాది.. నువ్వు పెళ్లి చేసుకోవద్దంటూ వార్నింగ్.. కూతురు వయస్సున్న అమ్మాయిపై కన్నేసిన కామాంధుడు.. చివరికి...

Telangana: ఆ పిల్ల నాది.. నువ్వు పెళ్లి చేసుకోవద్దంటూ వార్నింగ్.. కూతురు వయస్సున్న అమ్మాయిపై కన్నేసిన కామాంధుడు.. చివరికి...

ప్రతీకాత్మక చిత్రం

Vikarabad: తండ్రి వయస్సు ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి కూతురు లాంటి వయస్సున్న అమ్మాయిని ట్రాప్ లో పెట్టాడు. తనని పెళ్లి చేసుకుంటానంటూ నిత్యం ఫోన్ చేసి వేధించడం మొదలు పెట్టాడు. చివరికి తన నిశ్చితార్థం రద్దు అయ్యే వరకు వదల లేదు. అసలు ఏం జరిగిందంటే..

  • Share this:
    వివాహితుడైన ఓ ప్రభుత్వ ఉద్యోగి నిన్ను ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. ఇంటి పక్కనే ఉంటూ మంచి వాడిలా నటిస్తూ  రెండో పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మబలికి ట్రాప్ లో పెట్టాడు. బరితెగించి ఆమెతో నిశ్చితార్థం జరిగిన అబ్బాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. అమ్మాయి నాదే.. నువ్వు మధ్యలో రాకు.. పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని బెదిరించాడు. తనకు వివాహం జరిగిందన్న విషయం తెలిసి కూడా తనతో తిరిగిందని.. ఆమెను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని తరచూ ఫోన్ చేసి చెబుతూ.. ఏకంగా నిశ్చితార్ధం రద్దు చేసుకునేలా ప్రవర్తించాడు. అమ్మాయి పెళ్లి రద్దు చేయించడంతో బాధితురాలు.. ఆమె తల్లిదండ్రులు కంటతడిపెట్టుకుని బోరుమని విలపించారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రి వయస్సు ఉన్న కామాంధుడు వెంకటేశ్(48) పరిగి ప్రభుత్వ అసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఉందనే అహంకారంతో డబ్బుతో అందంగా ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేయడం అతనికి అలవాటుగా చేసుకున్నాడు. దాదాపు తన కూతురు వయసున్న తన ఇంటి పక్కనే నివాసముంటున్న 25 సంవత్సరాల యువతిపై కామాంధుడి కన్ను పడింది.

    మందలించినా వినని కామాంధుడు..

    అమ్మాయితో రోజూ మాట్లాడుతూ.. వాళ్ల ఇంట్లో చిన్నా చితకా పనులు చేస్తు మంచి వాడిలా నటిస్తు అమ్మాయిని ట్రాప్ లోకి దింపాడు. తనకు పెళ్లయినా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని వేధించడం ప్రారంభించాడు. అమ్మాయికి ఎస్జీటీ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. ఇంటి వద్ద ఉండకుండా ఉద్యోగానికి వెళ్తున్నా వదిలిపెట్టకుండా అమ్మాయి పని చేస్తున్న పాఠశాలకు వెళ్లి వేధించడం మొదలుపెట్టాడు. దీనిపై ఆగ్రహించిన కుబుంబసభ్యలు , పెద్దలు అతన్ని పిలిచి మందలించి, నచ్చ చెబితే, సరే మళ్లీ మీ అమ్మాయి జోలికి వెళ్లనని చెప్పి రెండ్రోజులు పోయాక మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో మరో యువకునితో పెళ్లి జరిపించడానికి ఆమెకు నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. వచ్చే మే నెల 17న సదరు యువకుడితో పెళ్లి జరిపించాలని ఖరారు చేసుకున్నారు.

    పెళ్లి రద్దు చేసుకున్న పెళ్లికొడుకు బంధువులు

    ఈ విషయం తెలిసినా వెంకటేష్ వెంటపడుతూనే ఉన్నాడు. వేరేవేరే నెంబర్లతో అమ్మాయికి ఫోన్ చేసి అతన్ని పెళ్లి చేసుకోకు, నేను నిన్ను చేసుకుంటానని ప్రతి రోజు వేంకటేష్ వేధించాడు. అంతటితో ఆగకుండా నిశ్చితార్ధం చేసుకున్న అబ్బాయి వివరాలు తెలుసుకుని అతడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. నువ్వు తనను మర్చిపో .. ఆ పిల్ల నాది అంటూ బెదిరించాడు. వెంకటేశ్ పెట్టే ఇబ్బందులను భరించలేక పెళ్లి ఖాయం చేసుకున్న పెళ్లి కొడుకు వారు తమకు ఈ పెళ్లి వద్దు అంటూ చెప్పేశారు. దీంతో అమ్మాయి కుటుంబీకులు తీవ్ర మనోదేదకు గురయ్యారు.  కామాంధుడి నుంచి తమను కాపాడాలని, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఇలా వేధిస్తున్న అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ భాధితురాలు తల్లిదండ్రులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలని వేడుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    Published by:Veera Babu
    First published: