మీరు చికెన్ ప్రియులా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే..

నాసిరకం చికెన్ అమ్మకాలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న స్టాల్స్‌పై కఠిన చర్యలు తప్పవని ప్రజాఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు.అసలే నాసిరకం మాంసం.. పైగా నిల్వ ఉంచిన మాంసం కావడంతో.. తిన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.

news18-telugu
Updated: September 2, 2019, 10:22 AM IST
మీరు చికెన్ ప్రియులా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మార్కెట్లో దొరికే వస్తువుల్లో ఏది కల్తీయో.. ఏది మంచిదో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. తిన్నాక.. ఆస్పత్రిపాలైతే తప్ప తిన్నది కల్తీ అని నిర్దారించుకోలేని స్థితి. ముఖ్యంగా మాంసాహారం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే.. చికెన్,మటన్ పేరుతో నాసిరకం మాంసాన్నో లేదా మరే జంతువు మాంసాన్నో అంటగట్టే రోజులివి. తాజాగా నెల్లూరు జిల్లాలోనూ ఇదే తరహా ఉదంతం వెలుగుచూసింది. తమిళనాడు నుంచి తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్న నాసిరకం చికెన్‌ను ఇక్కడ ఎక్కువ రేటుకు
విక్రయిస్తున్నారు. ప్రజా ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీల్లో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి.

తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కోడి లివర్,కందనకాయ,కోడి కాళ్లు,కోడి వెనుక భాగాలను తినడానికి ఇష్టపడరు. అక్కడి చికెన్ స్టాల్ నిర్వాహకులు వాటిని డంపింగ్ యార్డులకు తరలించేస్తుంటారు. అయితే పొరుగునే ఉన్న నెల్లూరు వ్యాపారులు దీన్నో వ్యాపారంగా మలుచుకున్నారు. అక్కడి కోయంబత్తూరు మార్కెట్‌లో తక్కువ ధరకు చికెన్ మాంసాన్ని కొనుగోలు చేసి జిల్లాకు తరలిస్తున్నారు. కిలో రూ.50 చొప్పున కొని దాదాపు రూ.130-రూ.180 వరకు విక్రయిస్తున్నారు.ఇలా దాదాపు 8 టన్నుల నాసిరకం చికెన్ రోజూ నెల్లూరుకు తరలుతున్నట్టు సమాచారం. ఇదే చికెన్‌ను బార్స్,రెస్టారెంట్స్‌కు కూడా విక్రయిస్తున్నారు.ఇలా నాసిరకం చికెన్ అమ్మకాలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న స్టాల్స్‌పై కఠిన చర్యలు తప్పవని ప్రజాఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు.అసలే నాసిరకం మాంసం.. పైగా నిల్వ ఉంచిన మాంసం కావడంతో.. తిన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇలాంటి చికెన్ అమ్మకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

First published: September 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>