విషాదం.. సెల్ఫీ దిగుతుండగా జలపాతంలో జారిపడి ఐదుగురు..

ఓ జలపాతం వద్ద సరదగా సెల్ఫీ దిగేందుకు ప్రయ్నతించిన ఐదుగురు వ్యక్తులు ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి ప్రాణాలు వదిలారు.

news18-telugu
Updated: July 3, 2020, 7:44 AM IST
విషాదం.. సెల్ఫీ దిగుతుండగా జలపాతంలో జారిపడి ఐదుగురు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సెల్ఫీ.. పేరు వినగానే కొంతమందికి పూనకం వచ్చేస్తుంది. రకరకాల భంగిమల్లో సెల్ఫీలకు ఫోజులిస్తుంటారు. మరికొంతమంది ఏకంగా ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సెల్ఫీలు దిగుతుంటారు. రోజురోజూకీ సెల్ఫీల ట్రెండ్ ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే ఎంతోమంది సెల్ఫీలు దిగే సమయంలో ప్రాణాలు సైతం పొగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఓ జలపాతం వద్ద సరదగా సెల్ఫీ దిగేందుకు ప్రయ్నతించిన ఐదుగురు వ్యక్తులు ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి ప్రాణాలు వదిలారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లా జవహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో నిబంధనలు ఉన్నప్పటికీ 13 మంది బృందంగా జవహార్ టౌన్ సమీపంలోని కాల్మండ్వి జలపాతం వద్దకు వెళ్లారు. అయితే బృందంలోని ఓ ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ తీసుకుంటూ పైనుంచి కింద ఉన్న కొలనులోకి ప్రమాదవశాత్తు జారిపడ్డారు.

ఇది గమనించిన మరికొంతమంది వారి రక్షించేందుకు నీళ్లలోకి దూకారు. ఈ క్రమంలో మొత్తం ఐదుగురు నీటిలో మునిగి ప్రాణాలు వదిలారు. బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
First published: July 3, 2020, 7:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading