• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • SELFI ACCIDENT STUDENT MISSED RANGANAYAK SAGAR WATER AT SIDDIPETA VB

Selfie accident: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. సెల్ఫీ తీసుకుంటూ నదిలో పడి గల్లంతయిన యువకుడు..

Selfie accident: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. సెల్ఫీ తీసుకుంటూ నదిలో పడి గల్లంతయిన యువకుడు..

ప్రతీకాత్మక చిత్రం(Image credit - you tube)

Selfie Accident: సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టెందుకు యువత సెల్ఫీలు అంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాగే సెల్ఫీ కోసం అంటూ వెళ్లి ప్రమాదశాత్తు నీటిలో పడి యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది.

  • Share this:
    సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టెందుకు యువత సెల్ఫీలు అంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాగే సెల్ఫీ కోసం అంటూ వెళ్లి ప్రమాదశాత్తు నీటిలో పడి యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. సెల్ఫీ సరదా ఓ బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. రంగనాయక సాగర్ ప్రాజెక్ట్‌ చూడడానికి వెళ్లిన బాలుడు అక్కడ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు ప్రాజెక్ట్‌ నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌ ప్రాజెక్ట్‌ వద్ద జరిగింది. దీంతో సిద్దిపేటలో విషాదం నిండింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. సిద్దిపేటకు చెందిన వెగ్గలం కార్తీక్‌ (15) తన మిత్రులు చరణ్‌, హేమంత్‌చారి, సాయిచరణ్‌లతో కలిసి చంద్లాపూర్‌ శివారులో ఉన్న రంగనాయకసాగర్‌ ప్రాజెక్ట్‌ చూసేందుకు వెళ్లాడు.

    అక్కడ కాసేపు మొత్తం ప్రాంతం కలియతిరిగి సరదాగా గడుపుతున్నారు. ఇలా తిరుగుతున్న క్రమంలో స్నేహితులతో కలిసి కార్తీక్‌ ఫొటోలు దిగుతున్నాడు. అనంతరం సెల్ఫీ ఫొటో కోసం ప్రయత్నాలు చేశాడు. రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ వద్ద పంపింగ్‌ చేసే స్థలంలో కార్తీక్‌, చరణ్‌ కలిసి సెల్ఫీ దిగుతుండగా వారు నిలబడిన చోటు ఒక్కసారిగా కింద ఉన్న మట్టిపెళ్లలు నీటిలోకి జారాయి. దీంతో దానిపైన నిలబడ్డ కార్తీక్‌, చరణ్‌ ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనా ప్రదేశంలో ఉన్న హేమంత్ చారి భయపడి కేకలు వేశాడు. భయపడుతూ చుట్టుపక్కల వారిని పిలిచాడు.

    ఎలాగోలా చరణ్‌ ఓ కట్టె సాయంతో నీటిలో నుంచి బయటపడ్డాడు. మరో స్నేహితుడు కార్తీక్‌ ను కాపాడే ప్రయత్నంలో అతడు నీటిలో మునిగి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కార్తీక్‌ కోసం గాలించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో కార్తీక్‌ మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  కాగా  శనివారం సాయంత్రం మరోసాగి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు