Home /News /crime /

SEIZURE OF 3 11 KG OF GOLD SMUGGLED IN UNDERWEAR AT SHAMSHABAD AIRPORT BN

లోదుస్తుల్లో బంగారం అక్రమ రవాణా.. విలువెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డామన్ నుంచి వందే భారత్ మిషన్ ప్రత్యేక విమానం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఆ విమానంలో ప్రయాణించిన ఓ 11 మంది ప్రయాణికులపై అక్కడి కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది.

    కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విమాన ప్రయాణాలన్నీ దాదాపు రద్దయ్యాయి. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను నడుపుతోంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కొంతమంది అక్రమార్కులు చేస్తున్న పని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఓవైపు కరోనాతో అతలాకుతలం అవుతుంటే.. మరో వైపు స్మగ్లర్లు ఇదే అదునుగా బంగారం అక్రమ రవాణాకు తేర లేపారు.అలా ఒక్కటీ రెండు లక్షలు కాదు రూ.1.66 కోట్ల విలువైన బంగారాన్ని లోదుస్తుల్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఎయిర్ పోర్టులోని కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ తతంగం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం డామన్ నుంచి వందే భారత్ మిషన్ ప్రత్యేక విమానం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఆ విమానంలో ప్రయాణించిన ఓ 11 మంది ప్రయాణికులపై అక్కడి కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది.

    వారిని తనిఖీ చేయగా ప్యాంట్ల లోపలి వైపు ప్రత్యేక జేబుల్లాగా ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో దాదాపుగా 3.11 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణ చేసేందుకు ప్రయత్నించారు. 11 మంది ప్రయాణికుల నుంచి అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.1.66 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు 11 మంది ప్రయాణికులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Airport, Gold smuggling, Hyderabad, Shamshabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు