SECURITY TIGHTENED AT CHARLAPALLY JAIL AMID DISHA MURDER CASE ACCUSED CUSTODY AK
చర్లపల్లి జైలు దగ్గర భారీ బందోబస్తు
ప్రతీకాత్మక చిత్రం
దిశ హత్య కేసు నిందితులను తమకు అప్పగించాలంటూ చర్లపల్లి దగ్గర కూడా స్థానికులు ఆందోళన చేస్తుండటంతో... నిందితులను షాద్ నగర్ తరలించడం పోలీసులకు సవాల్‌గా మారింది.
దిశ హత్య కేసు నిందితులను పోలీసు కస్టడీపై షాద్ నగర్ కోర్టు నేడు నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో... చర్లపల్లి జైలు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించే అవకాశం ఉండటంతో... పోలీసులు నిందితులను షాద్ నగర్‌కు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. జైలు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ విధించారు. ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని ప్రకటించారు.
దిశ హత్య కేసు నిందితులను తమకు అప్పగించాలంటూ చర్లపల్లి దగ్గర కూడా స్థానికులు ఆందోళన చేస్తుండటంతో... నిందితులను షాద్ నగర్ తరలించడం పోలీసులకు సవాల్‌గా మారింది. స్థానికులు, మహిళా సంఘాలు, ప్రజలు ఆందోళనలకు దిగే అవకాశం ఉందనే ముందస్తు సమాచారంతో... పటిష్ట భద్రత నడుమ పోలీసులు నిందితులను షాద్ నగర్‌కు తరలించనున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.