• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • SECURITY GUARD STOLEN MONEY FROM ATM CASH VAN IN KARIMNAGAR AND ACCUSED ARRESTED BY POLICE SSR

Karimnagar: ఏటీఎంలో డబ్బు నింపే వ్యాన్‌కు సెక్యూరిటీ.. రూ.5 లక్షలు ఎలా కాజేశాడో తెలిస్తే దిమాక్ ఖరాబే..!

Karimnagar: ఏటీఎంలో డబ్బు నింపే వ్యాన్‌కు సెక్యూరిటీ.. రూ.5 లక్షలు ఎలా కాజేశాడో తెలిస్తే దిమాక్ ఖరాబే..!

ప్రతీకాత్మక చిత్రం

రైటర్ సేఫ్ గార్డు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన వ్యక్తులు స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ నుంచి డబ్బు తీసుకెళ్లి.. బ్యాంకు అధికారులు చెప్పిన విధంగా జిల్లాలోని పలు ఏటీఎంల్లో డబ్బు నింపుతుంటారు. ఈ క్రమంలోనే.. సంస్థ ఏటీఎం ఆపరేటర్లు అయిన కృష్ణమోహన్, శ్రీధర్, సెక్యూరిటీ గార్డు బుర్ర సురేందర్‌లు మెయిన్ బ్రాంచ్ నుంచి డబ్బు తీసుకెళ్లి పలు ఏటీఎంల్లో జమ చేశారు. అన్ని ఏటీఎంల్లో జమ చేసినట్టుగానే కరీంనగర్ పట్టణంలోని సూర్యనగర్ ప్రాంతంలో ఉన్న ఏటీఎంలో కూడా డబ్బు జమ చేశారు.

  • Share this:
    కరీంనగర్: ఏటీఎం మెషీన్లలో సొమ్ము నింపే సంస్థ తరపున సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఏటీఎం మెషీన్లలో లక్షలకు లక్షలు డబ్బు నింపడం చూసి.. చూసి ఆ సొమ్ముపై ఆ సెక్యూరిటీ గార్డుకు ఆశ పుట్టింది. ఎప్పుడూ రూ.8 వేలో, పది వేలో జీతం ఏం తీసుకుంటా.. ఈసారి లక్షల్లో ట్రై చేద్దామనుకున్నాడు. ఎలాగూ.. తాను సెక్యూరిటీ గార్డునే కాబట్టి ఎవరికీ అనుమానం రాదనుకున్నాడు. సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశాడు. మొత్తానికి అనుకున్నంత పని చేశాడు. కానీ.. నేరం ఏదో ఒకరోజు బయటపడక తప్పదు కద. అతని తప్పు బయటపడటంతో ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన రైటర్ సేఫ్ గార్డు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన వ్యక్తులు స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ నుంచి డబ్బు తీసుకెళ్లి.. బ్యాంకు అధికారులు చెప్పిన విధంగా జిల్లాలోని పలు ఏటీఎంల్లో డబ్బు నింపుతుంటారు. ఈ క్రమంలోనే.. సంస్థ ఏటీఎం ఆపరేటర్లు అయిన కృష్ణమోహన్, శ్రీధర్, సెక్యూరిటీ గార్డు బుర్ర సురేందర్‌లు మెయిన్ బ్రాంచ్ నుంచి డబ్బు తీసుకెళ్లి పలు ఏటీఎంల్లో జమ చేశారు. అన్ని ఏటీఎంల్లో జమ చేసినట్టుగానే కరీంనగర్ పట్టణంలోని సూర్యనగర్ ప్రాంతంలో ఉన్న ఏటీఎంలో కూడా డబ్బు జమ చేశారు. అయితే.. ఆ సొమ్ము చూసిన సెక్యూరిటీ గార్డు సురేందర్‌కు ఆశ పుట్టింది. అయితే.. తనకు ఉన్న దురుద్దేశాన్ని ఎవరికీ చెప్పలేదు. ఏమీ ఎరగనట్టు వాళ్ల కళ్లుగప్పి వ్యాన్ దగ్గర కాపలాకు నిల్చున్నట్టు నిల్చున్నాడు. మిగతా సిబ్బంది ఏటీఎంలో డబ్బు నింపే పనిలో నిమగ్నమై ఉండగా.. వ్యాన్‌లో ఉన్న రూ.5 లక్షలు కాజేశాడు. కాజేసిన ఆ ఐదు లక్షలను అక్కడే ముళ్ల పొదల్లో పడేసి వాళ్లతో పాటు ఏమీ ఎరుగనట్టు వెళ్లిపోయాడు.

    ఆ తర్వాత.. డ్యూటీ అయిపోయాక ఆ ఐదు లక్షలను తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అయితే.. మిగతా సిబ్బంది డబ్బు తక్కువ ఉందని కంపెనీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఈ విషయంపై కంపెనీ సీనియర్ ఆఫీసర్ విజయ్ కరీంనగర్ టూ టౌన్‌లో ఫిర్యాదు చేశారు. డబ్బు దొంగిలించిన కొన్ని రోజుల తర్వాత నుంచి సురేందర్ విధులకు హాజరు కావడం మానేశాడు. దీంతో.. సురేందర్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. టూ టౌన్ సీఐ హరిప్రసాద్ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

    ఇది కూడా చదవండి: Warangal: నాలుగు నెలల క్రితం ఆ యువతికి పెళ్లైంది.. 20 రోజుల నుంచి భర్తతో కాకుండా ఎవరితో కలిసి ఉందో తెలిస్తే...

    పోలీసులు తమదైన శైలిలో విచారించగా డబ్బు కాజేసింది తానేనని సురేందర్ ఒప్పుకున్నాడు. దీంతో.. సురేందర్ కాజేసిన రూ.5లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సురేందర్‌ను సోమవారం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతనికి జైలు శిక్ష విధించింది. సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్న సురేందర్ ఉన్నంతలో సుఖపడక.. దురాశకు పోయి జైలు జీవితం గడుపుతున్నాడు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు