యువతి స్నానం చేస్తుండగా బాత్రూం కిటికీలో నుంచి చూస్తున్న సెక్యూరిటీ గార్డు...ఏం జరిగిందంటే...?

ఆ యువతి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా బాత్‌రూం కిటికీ వద్ద సెక్యూరిటీ గార్డు చేస్తున్న పని కంటపడింది.

news18-telugu
Updated: September 15, 2019, 10:51 PM IST
యువతి స్నానం చేస్తుండగా బాత్రూం కిటికీలో నుంచి చూస్తున్న సెక్యూరిటీ గార్డు...ఏం జరిగిందంటే...?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బాత్‌రూంలో యువతి స్నానం చేస్తుండగా కిటికీ లోనుంచి చూసి ఫోటోలు తీసిన ఓ సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో ఓ గెస్ట్ హౌస్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నిందితుడు గెస్ట్ హౌస్ కు వచ్చే అతిథులు బాత్రూంలో స్నానం చేస్తుంటే కిటికీలో నుంచి చూసి పైశాచికానందాన్ని పొందేవాడు. అంతేకాదు ఫొటోలు, వీడియోలు కూడా తీస్తూ సోషల్ మీడియాలో పెడుతుండే వాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆఫీసు పనిమీద గెస్ట్ హౌస్ లో బస చేసింది. ఈ క్రమంలో బాత్‌రూంలో ఆ యువతి స్నానం చేస్తున్న సమయంలో స్టూల్‌ ఎక్కి తొంగి చూస్తున్నాడు. అయితే యువతికి అనుమానం వచ్చి కిటికీ వైపు చూడగా, నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

దీంతో ఆ యువతి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా బాత్‌రూం కిటికీ వద్ద సెక్యూరిటీ గార్డు చేస్తున్న పని కంటపడింది. సీసీ ఫుటేజీలను సేకరించిన యువతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
First published: September 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading