ఆ కామాంధుడు.. ఆరేళ్ల బాలికను కొట్టి చంపి.. ఆమె మృతదేహంతో..

బాలిక మృతదేహంతోనే సెక్స్ చేశాడు. డెడ్ బాడీని అక్కడే పడేసి వెళ్లిపోయాడు. బాలిక కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు వెతకగా, చెట్ల పొదల చాటున మృతదేహం కనిపించింది.

news18-telugu
Updated: April 30, 2019, 10:31 AM IST
ఆ కామాంధుడు.. ఆరేళ్ల బాలికను కొట్టి చంపి.. ఆమె మృతదేహంతో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇదో అమానవీయ ఘటన.. ఓ కామాంధుడి చేతిలో ఆరేళ్ల బాలిక చితికిపోయింది. చిన్న పాప అని కూడా చూడకుండా ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, చంపేసి, ఆ మృతదేహంతో మళ్లీ దారుణానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. హరిద్వార్‌లోని మురికివాడలో నివాసముండే ఓ బాలిక గత శుక్రవారం స్నేహితులతో ఆడుకుందామని బయటికి వెళ్లింది. ఆ పక్కనే పౌల్ట్రీ ఫామ్‌లో సెక్యూరిటీ గార్డు‌గా పనిచేసే సోను ఆ పాపపై కన్నేశాడు. ఆ బాలికను పిలిచి ఓ చోటుకు వెళ్దామని చెట్ల పొదల చాటుకు తీసుకెళ్లాడు. ఆమెను లోబర్చుకుని అత్యాచారం చేయబోయాడు. ఆ బాలిక అరవడంతో నోరు మూసి దారుణంగా చితకబాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

అయినా, వదలని ఆ నీచుడు.. బాలిక మృతదేహంతోనే సెక్స్ చేశాడు. డెడ్ బాడీని అక్కడే పడేసి వెళ్లిపోయాడు. బాలిక కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు వెతకగా, చెట్ల పొదల చాటున మృతదేహం కనిపించింది. ఏదో అఘాయిత్యం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు నిజం బయటపడింది. పోలీసులు బాలికతో ఆడుకున్న పిల్లలను ప్రశ్నించగా సెక్యూరిటీ గార్డు తీసుకెళ్లినట్లు చెప్పారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని తమ శైలిలో ప్రశ్నించగా నిజాన్ని ఒప్పుకున్నాడు. అయితే, ఈ ఘటన వెనుక మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత వారం సెక్యూరిటీ గార్డు సహా మరో వ్యక్తితో తమకు గొడవ జరిగిందని, ఆ కోపంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని వెల్లడించారు. మరో వ్యక్తిపైనా చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

First published: April 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు