SECURITY GUARD HELD FOR RAPING 65YEAR OLD WOMAN IN THANE IN MAHARASHTRA MKS
గేటెడ్ కమ్యూనిటీ ఘోరం : అమ్మా.. కొన్ని మంచి నీళ్లు ఇస్తారా అంటూ లోనికెళ్లిన సెక్యూరిటీ గార్డు..
ప్రతీకాత్మక చిత్రం
గేటెడ్ కమ్యూనిటీ సొసైటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన 25 ఏళ్ల యువకుడు.. ఏ ఇంట్లో ఏం జరుగుతుందో పక్కాగా గమనించేవాడు.. సులువుగా చేతికి చిక్కుతారని బలహీనుల్ని టార్గెట్ చేసేవాడు.. మంచి నీళ్ల వంకతో ఇంట్లోకి దూరి 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి..
అదొక గేటెడ్ కమ్యూనిటీ.. ఒకే కాంపౌడ్ లో వందలాది ఇళ్లు.. వేల మంది జీవనం సాగిస్తుంటారు.. కొన్ని ఇళ్లల్లో ఎవరుంటారో, ఆయా ఫ్లాట్లలో ఏం కలాపాలు జరుగుతుంటాయానేదీ చాలా సార్లు అగమ్యగోచరంగానే ఉంటుంది.. కావడానికి కమ్యూనిటీనే అయినా ఇరుగుపొరుగు ఇళ్ల వ్యవహారాలపై ఎవరికీ పట్టింపు ఉండదు.. సరిగ్గా దీన్నే అవకాశంగా తీసుకున్నాడు అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డు.. ఏ ఇంట్లో ఏం జరుగుతుందో కొన్ని రోజులపాటు గమనించి, కచ్చితమైన అంచనా కుదరిన తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడా గార్డు..
దేశ ఆర్థిక రాజధాని ముంబైని ఆనుకుని ఉండే మెట్రోపాలిటన సిటీ థానేలో అఘాయిత్యం జరిగింది. 65 ఏళ్ల వృద్ధురాలిపై 25 ఏళ్ల సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. థానే నగరంలోని ప్రఖ్యాత హౌజింగ్ సొసౌటీలో చోటుచేసుకున్న ఈ అకృత్యంతాలూకు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. థానే పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
థానే నగరంలోని ఓ హౌజింగ్ సొసైటీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తోన్న యువకుడు ఈనెల 3న కమ్యూనిటీలోని ఓ ఇంట్లోకి చొరబడి 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దాహంగా ఉంది, మంచి నీళ్లు ఇస్తారా అని అభ్యర్థించడంతో.. మన సెక్యూరిటీ గార్డేకదాని ఆమె తేలికగా తీసుకోవడం వల్లే అఘాయిత్యం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు,
సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోన్న నిందితుడు.. హౌజింగ్ సొసైటీలో ఎక్కడ ఏం జరుగుతోందో అన్నీ గమనించేవాడని, ఈజీ టార్గెట్ గా ఉంటుందని వృద్ధురాలిని ఎంచుకున్నాడని, మంచినీళ్ల వంకతో వెళ్లి తలుపు కొట్టాడని, ఆమె నీళ్లు తీసుకుని వచ్చేలోపు ఒంటరిగా ఉన్నదని నిర్ధారించుకుని లోనికి దూరిపోయాడని, వృద్దురాలు కేకలు వేయానికి కూడా వీల్లేకుండా నోటిని అదిమిపట్టి పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.
ఈ నెల 3న ఈ దారుణం చోటుచేసుకోగా, అత్యాచారానికి గురైన వృద్ధురాలు అదే రోజున పోలీసులకు ఫిర్యాదు చేసింది. వృద్ధురాలిని రేప్ చేసిన తర్వాత సెక్యూరిటీ గార్డు పారిపోయాడు. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. వారం రోజుల వేట తర్వాత ఎట్టకేలకు రేపిస్టు సెక్యూరిటీ గార్డు మంగళవారం నాడు పోలీసుల చేతికి చిక్కాడు. ప్రస్తుతం అతణ్ని రిమాండ్ కు తరలించారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.