చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై సెక్యూరిటీ గార్డ్ అత్యాచారం..

ఆ ప్రాంతంలో శని,ఆదివారాల్లో అలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు.. అతని ఫోటో పట్టుకుని వెళ్లి స్థానికంగా ప్రతీ ఇంట్లో ఆరా తీశారు.

news18-telugu
Updated: July 16, 2019, 12:25 PM IST
చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై సెక్యూరిటీ గార్డ్ అత్యాచారం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిన్నా పెద్దా తేడా లేకుండా దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. పసికందులపై కూడా కామాంధులు పశువాంఛతో విరుచుకుపడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ శివారులోని మైలార్‌దేవ్‌పల్లిలో ఇలాంటి  ఘటనే చోటు చేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిని మాయ మాటలతో
తీసుకెళ్లి ఓ సెక్యూరిటీ గార్డ్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

విషయం బయటకు వస్తే తమ పరువు పోతుందని భావించిన చిన్నారి తల్లిదండ్రులు చాలారోజుల వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇటీవల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. పోలీసుల విచారణలో నిందితుడి గురించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆ ప్రాంతంలో శని,ఆదివారాల్లో అలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు.. అతని ఫోటో పట్టుకుని వెళ్లి స్థానికంగా ప్రతీ ఇంట్లో ఆరా తీశారు.

అలా ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో అతను రాజస్తాన్‌కు చెందిన సుశీల్ కుమార్ సింగ్‌గా తెలిసింది. కాటేదాన్ ప్రాంతంలో ఉన్న జైన్ ఫుడ్ కంపెనీలో అతను సెక్యూరిటీగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. శని,ఆదివారాలు అతనికి సెలవు కావడంతో.. స్థానికంగా ఉండే బస్తీల్లోకి వెళ్లి.. చాక్టెట్లతో చిన్నారులను ఆకర్షిస్తాడని తెలిపారు. అనంతరం వారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేస్తాడని చెప్పారు. ఆపై ఏమీ ఎరుగనట్టు మళ్లీ కంపెనీకి వెళ్లిపోతాడన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అతను నేరం అంగీకరించాడు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

First published: July 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...