తెలంగాణ (Telangana), పొరుగు రాష్ట్రాల బోర్డర్లో గంటల వ్యవధిలోనే రెండు సార్లు మావోయిస్టులు (Maoists), రక్షణ బలగాల (Security Forces) మధ్య కాల్పులు (Firing) జరిగాయి. ఈ హఠాత్పరిణామానికి సరిహద్దు ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మొదటగాతెలంగాణ సరిహద్దు ప్రాంతం (Border Areas)కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ (Bijapur) జిల్లా మిర్టూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుద్మేర్ అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. బుధవారం సాయంత్రం 04.15 గంటలకు కుద్మేర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. గుర్తుతెలియని మావోయిస్టు మృతదేహాన్ని సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం దగ్గర నుండి పలు సంఖ్యలో కంట్రీ మేడ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కుద్మేర్ అటవీ ప్రాంతంలో..
భైరామ్‌గఢ్ ఏరియా కమిటీ (Bhairamgarh Area Committee)కి చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో, DRG మరియు పోలీస్ స్టేషన్ మిర్టూరు సంయుక్త దళం మిర్టూర్ ప్రాంతంలోని కుద్మేర్ గ్రామం వైపు పెట్రోలింగ్ శోధనకు బయలుదేరింది. పెట్రోలింగ్ సెర్చ్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కుద్మేర్ అటవీ ప్రాంతంలో పోలీసులు-నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ తర్వాత సంఘటన స్థలాన్ని శోధించిన తరువాత, గుర్తుతెలియని మగ మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు మరియు మృతదేహం దగ్గర నుండి పలు సంఖ్యలో కంట్రీ మేడ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్ ఘడ్ (Chhattisgarh) రాష్ట్రం దంతేవాడ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత హిరోలి గ్రామంలోని సీఏఎఫ్ (CAF) క్యాంపుపై బుధవారం రాత్రి మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిని ఏఎస్పీ రాజేంద్ర జైస్వాల్ ధృవీకరించారు. సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతం నుంచి మావోయిస్టులు క్యాంపు వైపుకి కాల్పులు జరిపారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటన నుంచి క్షణాల్లో పోలీసు తేరుకొని ఎదురుకాల్పులతో ధీటైన సమాధానం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పొదలమాటు నుంచి మావోయిస్టులు తప్పించుకొని పోయారు. సుమారు గంటకిపైగా ఎదురుకాల్పులు (Firing) జరిగినట్లు సమాచారం. బైలాడిలా కొండ కింద ఉన్న నక్సల్స్ ప్రభావిత గ్రామం హిరోలిలో ఈ మధ్యనే పోలీసు క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ ఏరియా మావోయిస్టుల రాకపోకలకు ప్రధాన ప్రాంతంగా పోలీసులు తెలిపారు.
NIA in Hyderabad: యువతి మిస్సింగ్ కేసు.. హైదరాబాద్‌లో ఎన్ఐఏ ప్రత్యక్షం.. అసలేం జరుగుతోంది?
దర్భా డివిజన్ లోని మలంగేర్ ఏరియా కమిటీ (Malanger Area Committee) ఈ ప్రాంతంలో చురుకుగా పనిచేస్తోందని పోలీసులు తెలిపారు. కీలకమైన ప్రాంతంలో క్యాంపు ఏర్పాటుచేసి మావోయిస్టుల కార్యకలాపాలకు పోలీసులు చెక్ పెట్టారు. ఇది జీర్ణించుకోలేక మావోయిస్టులు ఆగ్రహంతో సీఏఎఫ్ క్యాంపుపై వ్యూహాత్మకంగా దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాత్రి వేళ ఎదురుకాల్పులు జరగడంతో గురువారం ఆ ప్రాంతంలో జవాన్లు గాలింపు చర్యలు చేపట్టనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chatisghad, Crime news, Maoist attack, Telangana