భారతీయ రైళ్లల్లో సదుపాయాల గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ ఉండదు. రైళ్లల్లో సదుపాయాలు సరిగ్గా ఉంటే అదే పెద్ద వార్తవుతుందంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. రైలు ప్రయాణంలో తినుబండారాల గురించి పక్కన పెడితే ఆ రైలు బోగీల్లో ఉండే మరుగుదొడ్ల పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణం చేసేవాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మరుగుదొడ్లను వాడుతుంటారు. కొన్ని రైళ్లల్లో పరిస్థితి బాగానే ఉన్నా, మెజార్టీ రైళ్లల్లో మాత్రం పరిస్థితి అత్యంత దారుణంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే ఓ ఘటన గురించి తెలిస్తే మాత్రం అసలు రైలు జర్నీలో మరుగుదొడ్డిని వాడాలంటేనే భయపడిపోతారేమో. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఓ ఉద్యోగి మార్చి 16వ తారీఖున Mumbai నుంచి Bhagatnaki Kothi కి వెళ్లే రైల్లో ప్రయాణిస్తున్నాడు. తప్పని సరి పరిస్థితుల్లో ఓ మరుగుదొడ్లోకి వెళ్లాడు. అయితే అక్కడే ఉన్న డస్ట్ బిన్ కింద ఏదో ఉన్నట్టుగా అతడికి అనిపించింది. అనుమానంతో చెక్ చేస్తే అక్కడ ఓ పవర్ బ్యాంక్, ఆ పవర్ బ్యాంకు పిన్ వైరుకు ఉన్న చివర్లో అత్యంత చిన్నదైన సెక్యూరిటీ కెమెరా ఒకటి కనిపించింది. ఆ మరుగుదొడ్లో సీక్రెట్ కెమెరా పెట్టి, ఫొటోలను తీస్తున్నారని అప్పుడు అతడికి అర్థమయింది. వెంటనే ఆ రైల్లో ఉన్న రైల్వే పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు.
ఈ వీడియోను కూడా చూడండి: శునకం వర్సెస్ పాము వైరల్ వీడియో
ఈ ఘటన తీవ్ర కలకలం రేకెత్తించడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణను వేగవంతం చేశారు. మొత్తానికి ఆ రైల్లో స్వీపర్ గా పనిచేసే షేక్ జహిద్దీన్ అనే వ్యక్తే ఈ నిర్వాకానికి పాల్పడ్డాడని తేల్చారు. అతడిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు. అయితే ఎంత కాలం నుంచి ఇలా సీక్రెట్ కెమెరా ద్వారా రికార్డు చేస్తున్నాడు. బ్యాకప్ ఏమైనా, ఎక్కడైనా దాచాడా? ఎవరికైనా అమ్మేశాడా? వంటి వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Crime story, CYBER CRIME, India Railways, Indian Railway, Train accident