గొంతులో మేకు... అక్కడ లక్ష కావాలన్నారు... ఇక్కడ రూ.60తో పనైపోయింది...

మహారాష్ట్రలో ఆసుపత్రిలో గొంతులో మేకు తీయడానికి లక్ష అవుతుందని చెప్పిన డాక్టర్లు... రూ.60 ఎక్స్‌రే తీసి, మూడు నిమిషాల్లో మేకు బయటికి తీసిన సూరత్ డాక్టర్లు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 12, 2019, 6:38 PM IST
గొంతులో మేకు... అక్కడ లక్ష కావాలన్నారు... ఇక్కడ రూ.60తో పనైపోయింది...
గొంతులో మేకు... అక్కడ లక్ష కావాలన్నారు... ఇక్కడ రూ.60తో పనైపోయింది...
  • Share this:
ఆ పిల్లాడి వయసు నాలుగేళ్లు. ఇంట్లో ఆడుకుంటూ సెల్ఫ్‌లో ఉన్న ఓ మేకు నోట్లో వేసుకున్నాడు. తల్లిదండ్రులు గుర్తించేలోగా అది కాస్తా గొంతులోకి వెళ్లి ఇరుక్కుంది. దాంతో ఏం చేయాలో తెలియక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్లు ‘గొంతులో మేకు’ బయటికి తీయడానికి లక్ష కావాలన్నారు. అక్కడి నుంచి ప్లేస్ మార్చి మరో చోటుకి వెళితే మూడు నిమిషాల్లో మేకు తీసి, చేతుల్లో పెట్టారు. స్థానికంగా తెగ వైరల్ అవుతోన్న ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా దేవ్‌గావ్ గ్రామానికి చెందిన ప్రవీణ్ భాయ్ పటేల్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ప్రథమేశ్ అని నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ప్రథమేశ్... ఓ మేకు మింగేశాడు. అది కాస్తా గొంతు మధ్యలో వెళ్లి, ఇరుక్కుపోయింది. గుర్తించిన వెంటనే ప్రథమేశ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఆ టెస్టులు, ఈ టెస్టులు అని చాలా పరీక్షలు చేసి, మేకు ఎక్కడ ఇరుక్కుందో పక్కాగా పసిగట్టిన వైద్యులు... మేకు తీసేందుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని తేల్చారు. వ్యవసాయం చేస్తూ బతికే ప్రవీణ్ భాయ్... అంత మొత్తం భరించలేక ఏం చేయాలో తెలియక దిగులుతో కూర్చున్నాడు. అప్పుడే సూరత్‌లో ఉండే ఓ బంధువుకి విషయం తెలిసి... తన దగ్గరకి రమ్మని ఫోన్ చేశాడు.

మరో మార్గం లేక స్నేహితుడి సూచన మేరకు బంధువుల ఉన్న సూరత్‌కు పిల్లాడిని తీసుకెళ్లాడు ప్రవీణ్. అక్కడ సివిల్ ఆసుపత్రిలో ప్రథమేశ్‌ను చూపించారు. అక్కడ పిల్లాడి గొంతుకు ఇంకోసారి ఎక్స్‌రే తీసిన డాక్టర్లు... టెలిస్కోపీ పద్ధతిలో మూడు నిమిషాల్లో బయటికి తీశారు. లక్ష ఖర్చవుతుందని బయపడిన ప్రవీణ్‌భాయ్... ఎక్స్‌రే కోసం రూ.60 చెల్లించాడంతే. ఆశ్చర్యంతో పాటు ఆనందంలో మునిగిపోయిన ప్రవీణ్ భాయ్... తన స్నేహితులకు విషయం చెప్పడం, వారు సోషల్ మీడియాలో ఫోటోలతో సహా పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

First published: April 12, 2019, 6:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading