హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad: భర్త చాక్ పీసులు తినొద్దన్నాడని.. ప్రాణాలు తీసుకున్న భార్య

Hyderabad: భర్త చాక్ పీసులు తినొద్దన్నాడని.. ప్రాణాలు తీసుకున్న భార్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: చాక్ పీసులు తినొద్దని భర్త మందలించాడన్న కోపంతో ఓ మహిళ ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.

ఇటీవలి కాలంలో కొందరు చిన్న చిన్న విషయాలను సైతం పెద్ద సమస్యలుగా భావిస్తున్నారు. అనవసర విషయాలకు మనస్పర్థలకు గురవుతున్నారు. ఈ క్రమంలో క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. అయిన వారిని అనాథలుగా మారుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ లోని జీడిమెట్లలో చోటు చేసుకుంది. చాక్ పీసులు తినొద్దని భర్త మందలించాడన్న కోపంతో ఓ మహిళ ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన బాధిత కుటుంబంలో పెను విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంజుయాదవ్, తుఫాన్ యాదవ్ కు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరు ఏడాది క్రితం హైదరాబాద్ నగరానికి బతుకుదెరువు కోసం వలస వచ్చారు. ఈ క్రమంలో అయోధ్యనగర్ లో ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. తుఫాన్ యాదవ్ జీడిమెట్లలోని ఓ పరిశ్రమలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే అతని భార్య సంజు యాదవ్ కు సుద్ద ముక్కలు తినే అలవాటు ఉంది. అయితే అవి తింటే ఆరోగ్యం పాడవుతుందని.. ఆ అలవాటు మానుకోవాలని భర్త తుఫాన్ యాదవ్ ఆమెను అనేక సార్లు హెచ్చరిస్తూ వస్తున్నాడు. అయినా సంజు యాదవ్ ఆ అలవాటు మానుకోలేకపోయింది. భర్తకు తెలియకుండా సుద్ద ముక్కలు తీసుకుని వచ్చి.. అతను లేనప్పుడు తినేది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సైతం ఆమె సుద్ద ముక్కలను తెచ్చుకుని ఇంట్లో ఉంచింది.

ఆదివారం రాత్రి వాటిని చూసిన తుఫాన్ యాదవ్ భార్యతో గొడవపడ్డాడు. ఎన్ని సార్లు చెప్పినా ఆ అనారోగ్యకరమైన అలవాటు ఎందుకు మానుకోవడం లేదని మందలించాడు. ఆ సుద్దముక్కలను బయట పడేసి వస్తానని వెళ్లాడు. దీంతో సంజుయాదవ్ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో చున్నీతో ఇంట్లోని రేకులు షెడ్డుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. తుఫాన్ యాదవ్ చాక్ పీసులు పడేసి ఇంటికి వచ్చి చూసే సరికి అతని భార్య ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో చుట్టుపక్కల వారికి తుఫాన్ యాదవ్ విషయం తెలిపాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Hyderabad, Suicide, Telangana Police

ఉత్తమ కథలు