హోమ్ /వార్తలు /క్రైమ్ /

Rape On Student : నాలుగేళ్లుగా విద్యార్థినిపై సైన్స్ టీచర్ అత్యాచారం..ఫోన్లో రికార్డు చేసి మరీ

Rape On Student : నాలుగేళ్లుగా విద్యార్థినిపై సైన్స్ టీచర్ అత్యాచారం..ఫోన్లో రికార్డు చేసి మరీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AhMEDABAD Shocker : ఏం చేయాలో,ఎవరికి తన బాధ చెప్పుకోవాలో అర్థం కాని ఆ విద్యార్థిని మౌనంగా తనలోతానే రోదించేది. ఇటీవల బాధితురాలు.. తనకు పెళ్లి ప్రతిపాదనలు వస్తున్నాయని,దయచేసి నన్ను వదిలేయండి అని ఆ టీచర్ ని వేడుకుంది.

Science Teacher Raped Student :  అతడు గౌరవనీయమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు. విద్యార్థులుకు మంచి విద్యా బుద్ధులు నేర్పించి వారి ఉన్నతమైవారిగా తీర్చిదిద్దడం అతని బాధ్యత. అయితే అతను మాత్రం అది మరిచి..తన దగ్గర చదువు కోసం వచ్చిన విద్యార్థినిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏకంగా నాలుగేళ్ల నుంచి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నాడు. చివరికి పాపం పండి కటకటాల పాలయ్యాడు.

అహ్మదాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు బోధించే ప్రఖ్యాత కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ యొక్క థాల్తేజ్ బ్రాంచ్‌లో మయాంక్ దీక్షిత్‌(42)సైన్స్ టీచర్‌గా మరియు మోటివేషనల్ స్పీకర్‌గా పనిచేస్తున్నారు. అయితే 2016లో మయాంక్ దీక్షిత్‌ పనిచేసే ఇనిస్టిట్యూట్ లొ 16ఏళ్ల యువతి కోచింగ్ కోసం జాయిన్ అయ్యింది. అయితే అప్పుడే మయాంక్ కన్ను ఆ యువతిపై పడింది. రోజూ క్లాస్ అయిపోన తర్వాత నీతో మాట్లాడాలి అంటూ ఆ యువతికి అదనపు సమయం ఇచ్చేవాడు. మాయమాటలు చెప్పి ఓ సారి ఆ యువతిని తన ఇంటికి తీసుకెళ్లాడు. మొదటిసారిగా ఆ యువతిపై అప్పుడే మయాంక్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను వీడియో రికార్డ్ కూడా చేసి తన లైంగిక వాంఛలను తీర్చాలని తరచూ విద్యార్థిని బెదిరించేవాడు. ఎవరికైనా ఈ విషయం చెబితే వీడియోను ఇంటర్నెట్ లో పెడతాని విద్యార్థినిని బెదిరించేవాడు.

ALSO READ స్పా సెంటర్‌లో పట్టుబడ్డ 12మంది అమ్మాయిలు..లోపల ఏం చేస్తున్నారో తెలుసా

ఏం చేయాలో,ఎవరికి తన బాధ చెప్పుకోవాలో అర్థం కాని ఆ విద్యార్థిని మౌనంగా తనలోతానే రోదించేది. ఇటీవల బాధితురాలు.. తనకు పెళ్లి ప్రతిపాదనలు వస్తున్నాయని,దయచేసి నన్ను వదిలేయండి అని మయాంక్ ని వేడుకుంది. ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తే నీ నగ్న వీడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తానని ఆ విద్యార్థినిని మయాంక్ బెదిరించాడు. టీచర్ బెదిరింపులకు భయపడిన ఆ విద్యార్థిని డిప్రెషన్‌లోకి వెళ్లడంతో ఆమె ప్రవర్తనలో మార్పులను తల్లిదండ్రులు గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యువతి తన కుటుంబం మద్దతు మద్దుతుతో వస్త్రపూర్ పోలీస్ స్టేషన్‌లో మయాంక్ పై ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద సైన్స్ టీచర్‌ మయాంక్ పై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అతడిని అరెస్ట్ చేశారు. ఇంజనీరింగ్ మరియు మెడికల్ కోర్సులు బోధించే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులకు సైన్స్ బోధించేవాడు మరియు ప్రేరణాత్మక ఉపన్యాసాలు ఇచ్చేవాడు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Ahmedabad, College student, Crime news, Gujarat, Rape on girl

ఉత్తమ కథలు