ఆన్‌లైన్ క్లాసుల కోసం సెల్‌ఫోన్ చోరీ.. కొత్త ఫోన్ కొనిచ్చిన మహిళా పోలీసు

ఆన్‌లైన్ క్లాసులు వినేందకు సెల్‌ఫోన్ చోరీ చేస్తూ పట్టుబడిన విద్యార్థిలో మార్పు తెచ్చేందుకు ఓ మహిళా పోలీసు యత్నించారు. ఇందుకోసం ఆ బాలుడికి కొత్త సెల్‌ఫోన్ కొనిచ్చారు.

news18-telugu
Updated: September 22, 2020, 8:16 AM IST
ఆన్‌లైన్ క్లాసుల కోసం సెల్‌ఫోన్ చోరీ.. కొత్త ఫోన్ కొనిచ్చిన మహిళా పోలీసు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆన్‌లైన్ క్లాసులు వినేందకు సెల్‌ఫోన్ చోరీ చేస్తూ పట్టుబడిన విద్యార్థిలో మార్పు తెచ్చేందుకు ఓ మహిళా పోలీసు యత్నించారు. ఇందుకోసం ఆ బాలుడికి కొత్త సెల్‌ఫోన్ కొనిచ్చారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువొత్తియూరులో చోటుచేసుకుంది. వివరాలు.. 13 ఏళ్ల విద్యార్థి కార్పొరేషన్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి బిస్కెట్ కంపెనీలో, తల్లి పనిమనిషిగా పని చేస్తున్నారు. పేదరికంలో ఉన్న అతడికి ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు సెల్‌ఫోన్ కొనుగోలు చేయడం కష్టంగా మారింది.

విద్యార్థి పరిస్థితులను గమనించిన అతని ఇంటి సమీపంలో ఉండే ఇద్దరు నేరస్థులు అతన్ని తమతో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. పిల్లాడు తమతో ఉంటే దొంగతనాలు చేయడం కొద్దిగా తేలికగా అవుతుందని.. తమను అనుమానించడం తగ్గుందని భావించారు. పోలీసులకు పట్టుబడినా.. పిల్లాడితో సింపతి వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. ఆన్‌లైన్ క్లాసుల కోసం సెల్‌ఫోన్ కొనలేని పరిస్థితుల్లో ఉన్న ఆ విద్యార్థిని వారి మార్గంలోకి తీసుకొచ్చారు. అతనికి చోరీ ఎలా చేయాలో శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలోనే విద్యార్థి సెల్‌ఫోన్ చేరి చేస్తూ గస్తీలో ఉన్న క్రైమ్ ఇన్‌స్పెక్టర్ భువనేశ్వరికి చిక్కాడు.

దీంతో ఆమె బాలుడిని విచారించగా.. అసలు విషయం చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఆ విద్యార్థికి ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు సెల్‌ఫోన్ కొనిచ్చిన భువనేశ్వరి.. ఇంకెప్పుడూ దొంగతనాలు చేయకూడదని కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే బాలుడు ఇచ్చిన సమాచారంతో అతడిని ఇలా మార్చిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశాడు.
Published by: Sumanth Kanukula
First published: September 22, 2020, 8:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading