Home /News /crime /

SCHOOL TEACHER THRASHED FOR SENDING LOVE LETTER TO 12 YEAR OLD STUDENT IN MADHYAPRADESH VB

Madhyapradesh: ఉపాధ్యాయుడి ముఖంపై నల్లరంగు పూసి.. అరగుండు కొట్టి గ్రామంలో ఊరేగించారు.. అసలేం జరిగిందంటే..

ఉపాధ్యాయుడికి అరగుండు కొట్టించిన గ్రామస్తులు (Image credit : ANI)

ఉపాధ్యాయుడికి అరగుండు కొట్టించిన గ్రామస్తులు (Image credit : ANI)

Madhyapradesh: 12 ఏళ్ల విద్యార్థినికి ప్రేమలేఖ రాసినట్లు ఆరోపణలు రావడంతో పాఠశాల ఉపాధ్యాయుడి ముఖంపై నల్ల రంగు పూసి.. సగం గుండు చేయించి గ్రామంలో ఊరేగించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలోని మన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడిపై పోక్సోతోపాటు ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసినట్లు తెలిపారు.

ఇంకా చదవండి ...
    మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలోనిమన్పూర్ గ్రామంలో 24 ఏళ్ల వైభవ్ నాయక్ ప్రైవేట్ పాఠశాల నడుపుతున్నాడు. అతడితో పాటు మరో ఉపాధ్యాయుడు కూడా పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే అదే గ్రామంలో నివసిస్తున్న 8వ తరగతి చదువుతున్న ఓ బాలికకు అతడు ఆరేళ్ల బాలికతో ఒక ప్రేమ లేఖను పంపించాడు. ఈ విషయం కాస్త కుటుంబసభ్యులకు , గ్రామస్తులకు తెలవడంతో అతడిని పట్టుకొని చితకబాదారు. అంతేకాకుండా అతడి ముఖం నిండా నల్ల రంగు పూసి, అర గుండు కొట్టించి గ్రామంలో ఊరేగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఉపాధ్యాయుడిపై దాడి చేసినందుకు గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు మన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి హితేంద్ర సింగ్ రాథోడ్ తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి మాట్లాడారు. 8వ త‌ర‌గ‌తి చ‌ద‌వుతున్న తన కుమార్తెను కోచింగ్ కోసం ఆర్ఎస్ పబ్లిక్ స్కూల్ కు సంవత్సరం క్రితం పంపించినట్లు తెలిపాడు. ఆ పాఠశాలను వైభవ్ నాయక్ అనే ఉపాధ్యాయుడు నడిపించేవాడు.

    ఆ సమయంలోనే అతడు తమ కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడని తెలిపాడు. ఆ విషయం తెలిసిన మరు క్షణమే ట్యూషన్ కు పంపించడం బంద్ చేయించినట్లు తెలిపాడు. ఆ తర్వాత రెండు మూడు రోజు కిందట ఆరు సంవత్సరాల అమ్మాయితో తమ కూతురుకు లవ్ లెటర్ పంపించినట్లు తెలిపాడు. త‌న ప్రేమ‌ను నిరాక‌రిస్తే ఆమె త‌ల్లిదండ్రులు ఇబ్బందులకు గుర‌వుతార‌ని బెదిరించాడు. అందులో ఫోన్ నంబర్ ఇచ్చి దానికి కాల్ చేయమని తెలిపినట్లు అతడు తెలిపాడు. దీంతో ఆ బాలిక భయపడిపోయి తమతో చెప్పినట్లు తెలిపాడు.

    ఈ విషయం గ్రామస్తులకు తెలవడంతో అతడిపై దాడి చేసినట్లు ఆయన చెప్పాడు. కాగా, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ప‌ది మందిపై కేసు న‌మోదు చేయ‌డంతోపాటు ఆ ఉపాధ్యాయుడ్ని అరెస్ట్ చేసి అతడిపై పోక్సోతోపాటు ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు మ‌న్సూర్ పోలీస్ స్టేష‌న్ అధికారి తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime, Crime news, Love letter, Private teachers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు