హోమ్ /వార్తలు /క్రైమ్ /

క్లాస్‌రూమ్‌లో టీచర్ పాడుపని.. సాయం చేసిన మరో టీచర్.. ఆ నీచపు పని వల్ల..

క్లాస్‌రూమ్‌లో టీచర్ పాడుపని.. సాయం చేసిన మరో టీచర్.. ఆ నీచపు పని వల్ల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు.. క్లాస్‌రూమ్‌లో పాడుపని చేశాడు. 6వ తరగతి విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారం చేశాడు.

  విద్యార్థులకు మంచి, చెడు చెప్పాల్సిన టీచర్లలో కొందరి బుద్ది వక్రమార్గం పడుతోంది. విద్యార్థులపైనే అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు కొందరు టీచర్లు. తాజాగా ఓ ఉపాధ్యాయుడు.. ఆరో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బాలిక కడుపు నొప్పితో బాధపడటంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు.. గర్భం దాల్చినట్టు చెప్పడంతో అసలు విషయం వెలుగుచూసింది. వివరాలు.. జోధ్‌పూర్ జిల్లాలోని బాలసేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామానికి చెందిన బాలిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. అయితే బాలికపై పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు.

  పాఠశాలలోనే పలుమార్లు బాలికను రేప్ చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని బాలికను టీచర్ బెదిరించాడు. ఈ నేరం చేసిన ఉపాధ్యాయుడిని.. మరో ఉపాధ్యాయుడు సాయం చేసేవాడు. అయితే తాజాగా బాలిక గర్భవతి అని తేలడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టీచర్ పాడుపని గురించి బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తండ్రి బాలేసర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటీ నుంచి నిందితులు ఇద్దరు పరారీలో ఉన్నారు.

  కొత్త రకం దందా.. నలుగురు యువతులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంతకీ వారు ఏం చేశారంటే..?

  పెళ్లయిన మహిళతో పెళ్లి.. కదులుతున్న రైల్లో కుంకుమ పెట్టి.. టాయిలెట్ పక్కన..


  ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ‘నిందితుడు సూరజ్‌ రామ్ బాలికపై మార్చి నెలలో మూడు, నాలుగు సార్లు లైంగిక దాడి జరిపాడు. సూరజ్ రామ్ క్లాస్ రూమ్‌లో బాలికను రేప్ చేసే సమయంలో తోటి ఉపాధ్యాయుడు సాహిరామ్ కాపలాగా ఉండేవాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది’ అని తెలిపారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, Rajasthan, RAPE, Teacher misbehave

  ఉత్తమ కథలు