Home /News /crime /

SCHOOL PRINCIPAL ARRESTED FOR LEAK OF EXAM PAPER IN UTTAR PRADESH 51 SO FAR PAH

Shocking: అయ్యో.. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ప్రిన్సి పల్.. ఆ పాడు పని చేసి అడ్డంగా దొరికి పోయాడు..

విచారణ చేపట్టిన పోలీసులు

విచారణ చేపట్టిన పోలీసులు

Uttar pradesh: విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు తప్పుడు పనులు చేస్తు.. వారి స్థానానికి మాయని మచ్చను తీసుకొని వస్తున్నారు. కొంత మంది ఉపాధ్యాయుల అనాలోచిత పనుల వలన .. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.

School Principal Arrested For Leak Of Exam Paper:  ఉత్తర ప్రదేశ్ లో ఇంటర్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకైన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనలో సుమారు 51 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా, ఒక ప్రైవేటు స్కూల్ ప్రిన్స్ పల్ ను కూడా బుధవారం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇంటర్ పరీక్ష పేపర్ లీక్ పై ఉభాన్ పోలీస్ స్టేషన్ లో విద్యార్థులు కేసు నమోదు చేశారు. పరీక్ష పేపర్ లీక్ కావడంతో బల్లియాతో సహా 24 జిల్లాల్లో పరీక్ష రద్దు అయింది.

రద్దు చేసిన పరీక్ష ఇప్పుడు ఏప్రిల్ 13న నిర్వహించ నున్నారు. పోలీసులు విచారణలో.. బల్లియాలోని ఓ ప్రైవేట్ ఇంటర్ కాలేజ్ మేనేజర్.. పేపర్‌ను లీక్ చేసి ఒక్కొక్కటి 25,000 నుంచి 30,000 వరకు కాపీలను విక్రయించినట్లు పోలీసుల విచారణలో తెలింది. ఈ కేసులో గతంలో అరెస్టయిన వారిలో బల్లియాలోని డిస్ట్రిక్ట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (DIoS) బ్రజేష్ కుమార్ మిశ్రా, ప్రైవేట్ ఇంటర్ కాలేజీ మేనేజర్లు మరియు ప్రిన్సిపాల్స్ మరియు ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సీరియస్ అయ్యారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.

ఢిల్లీలో బాలికపై గతంలో అత్యాచారం ఘటన కలకలంగా మారింది.

ఢిల్లీలోని మహేంద్ర పార్క్ లో ఈ దారుణం జరిగింది. శనివారం రాత్రి జరగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పోలీసుల ప్రకారం.. మహేంద్ర పార్క్ లో ఒక వీధిలో ఉన్న కుటుంబంపై, పక్క ఇంట్లో ఉండే మరొక వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 16 ఏళ్ల మైనర్ బాలిక దివ్యాంగురాలు. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నాం ఆమె తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత.. ఆమె ఇంట్లో ఒక్కతే ఉంది. అయితే, అదే వీధిలో ఉండే.. 24 ఏళ్ల యువకుడు.. బాలికపై కన్నేశాడు. ఆమె ఇంటికి వెళ్లాడు. తెలిసిన వాడే కదా .. అని బాలిక కూడా అతనితో మాట్లాడింది. కానీ అతని మనస్సులో దుర్మార్గాన్ని పసిగట్టలేక పోయింది.

ఈ క్రమంలో.. ఆ దుర్మార్గుడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత.. తలుపులు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాలిక తల్లిదండ్రులు తిరిగి వచ్చాక జరిగిన ఘోరాన్నిబాలిక చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. బాలికను పరీకల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉంది. దివ్యాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డ.. యువకుడిపై కఠిన చర్యలు తీసుకొవాలని గ్రామస్థులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Exams, Uttar pradesh, Yogi adityanath

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు