అనంతపురంలో హెడ్‌మాస్టర్ దాష్టీకం.. విద్యార్థుల కాళ్లు కట్టేసి..

స్కూల్లో అల్లరి చేస్తున్నారన్న కారణంతో ఇద్దరు చిన్నారుల పట్ల హెడ్ మాస్టర్ అమానుషంగా ప్రవర్తించాడు. చిన్నారులను క్లాస్‌రూమ్‌లో బెంచీలకు కట్టేశాడు.

news18-telugu
Updated: November 28, 2019, 3:42 PM IST
అనంతపురంలో హెడ్‌మాస్టర్ దాష్టీకం.. విద్యార్థుల కాళ్లు కట్టేసి..
విద్యార్థులను బెంచీలకు కట్టేసిన హెడ్ మాస్టర్
  • Share this:
అనంతపురంలో ఓ స్కూల్ హెడ్ మాస్టర్ రెచ్చిపోయాడు. విద్యార్థుల కాళ్లు, చేతులు కట్టేసి చిత్ర హింసలు పెట్టాడు. కదిరి పట్టణలోని మశానంపేట స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. స్కూల్లో అల్లరి చేస్తున్నారన్న కారణంతో ఇద్దరు చిన్నారుల పట్ల హెడ్ మాస్టర్ అమానుషంగా ప్రవర్తించాడు. చిన్నారులను క్లాస్‌రూమ్‌లో బెంచీలకు కట్టేశాడు. మళ్లీ అల్లరి చేయబోమని.. వదిలేయమని వేడుకున్నా ఆ టీచర్ వినలేదు. తోటి విద్యార్థుల ద్వారా విషయం బయటకు తెలియడంతో తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి హెడ్‌మాస్టర్‌తో వాగ్వాదానికి దిగారు. అతడి తీరుపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశాయి. ఆయన్ను విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Published by: Shiva Kumar Addula
First published: November 28, 2019, 3:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading