విద్యార్థినిపై హెడ్మాస్టర్ లైంగిక దాడి...స్కూళ్లోనే దారుణం...

అయితే గదిలో ఎవరూ లేని సందర్భం చూసిన హెడ్మాస్టర్ నెమ్మదిగా అందులోకి వెళ్లి తలుపు గడియ వేసాడు. భయంతో వణికిపోతున్న బాలికపై హెడ్మాస్టర్ తన పశువాంఛను తీర్చుకునేందుకు ప్రయత్నం చేశాడు.

news18-telugu
Updated: September 6, 2019, 4:10 PM IST
విద్యార్థినిపై హెడ్మాస్టర్ లైంగిక దాడి...స్కూళ్లోనే దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒడిషాలోని బుధ్ గడ్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై స్కూలు హెడ్మాస్టరే లైంగిక దాడికి యత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే...బుధ్‌గఢ్ గ్రామంలోని హైస్కూల్లో బాధిత బాలిక 10వ తరగతి చదువుతోంది. అయితే అదే పాఠశాలకు చెందిన హెడ్మాస్టర్ బాలికను గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. కాగా తాజాగా వినాయక చవితి సందర్భంగా పాఠశాలలో ఉత్సవం నిర్వహించగా, బాధిత బాలిక తరగతి గదికి వెళ్లింది. అయితే గదిలో ఎవరూ లేని సందర్భం చూసిన హెడ్మాస్టర్ నెమ్మదిగా అందులోకి వెళ్లి తలుపు గడియ వేసాడు. భయంతో వణికిపోతున్న బాలికపై హెడ్మాస్టర్ తన పశువాంఛను తీర్చుకునేందుకు ప్రయత్నం చేశాడు.

బాలిక గట్టిగా ప్రతిఘటించి కిటికీ నుంచి బయటకు దూకి పారిపోయింది. అనంతరం బాలిక తల్లిదండ్రులు హెడ్మాస్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న హెడ్మాస్టర్ కోసం గాలిస్తున్నారు.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>