మంచిర్యాలలో స్కూల్ బస్సు బీభత్సం.. బ్రేకులు ఫెయిల్ కావడంతో..

బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఐనప్పటికీ ఆగలేదు. ఎట్టకేలకు కొద్దిదూరం ప్రయాణించి.. రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని, అక్కడే ఆగిపోయింది.

news18-telugu
Updated: February 20, 2020, 6:49 PM IST
మంచిర్యాలలో స్కూల్ బస్సు బీభత్సం.. బ్రేకులు ఫెయిల్ కావడంతో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
స్కూల్ బస్సులంటే రోడ్ సేఫ్టీ రూల్స్ పక్కాగా పాటించాలి. చిన్నారులను స్కూల్‌కు చేరవేసే ఆ వాహనాలు మంచి కండిషన్‌లో ఉండాలి. బస్సును నడిపే డ్రైవర్ అనుభవజ్ఞుడై ఉండాలి. బస్సు ఫిట్‌నెస్‌ను నిత్యం పరిశీలిస్తూ.. అవసరమైన మరమ్మత్తులు చేేస్తుండాలి. ఇవేమీ లేకుండా స్కూల్ బస్సులు రోడ్లపై తిరగకూడదు. కానీ ఈ నిబంధనలను కొన్ని స్కూల్ యాజమాన్యాలు తుంగలో తొక్కుతున్నాయి. ఫిట్‌నెస్‌లేని బస్సులను రోడ్లపై తిప్పుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఐనప్పటికీ ఆగలేదు. ఎట్టకేలకు కొద్దిదూరం ప్రయాణించి.. రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని, అక్కడే ఆగిపోయింది. ప్రమాదంలో బస్సుతో పాటు యాక్టివా, ఆటో పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఐతే ఆ సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో ముప్పు తప్పింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు బీభత్సం గురించి ఆర్టీఏ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యలో నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.


First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు