తెలంగాణలో విషాదం... స్కూల్ బస్సు ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతి

Road Accident: తల్లిదండ్రుల మధ్య నెలకొన్న వివాదమే చిన్నారులు ప్రమాదానికి గురికావడానికి కారణమని తెలుస్తోంది.

news18-telugu
Updated: February 26, 2020, 7:54 AM IST
తెలంగాణలో విషాదం... స్కూల్ బస్సు ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో వరుస ప్రమాదాలు జనాన్ని వణికిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో పలు ప్రాంతల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు పోగుట్టుకున్నారు. తాజాగా మంగళవారం జహీరాబాద్‌లో కూడా ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. మార్కెట్‌కు వెళ్లి పళ్లు తీసుకొస్తున్న చిన్నారుల్ని స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనలో ఆ కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది. ఒకేసారి ఇద్దరు కన్నబిడ్డల్ని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న స్థానికుల చేత కూడా కంటతడి పెట్టించింద. అయితే తల్లిదండ్రుల మధ్య మంగళవారం చిన్న వివాదం నెలకొంది. దీంతో తండ్రి కొడుకుల్ని మార్కెట్‌కు వెళ్లి పుచ్చకాయలు తీసుకురామ్మని ఆవేశంలోచెప్పాడు. దీంతో మార్కెట్‌కువెళ్లి బైక్ పై పుచ్చకాయలు తీసుకొస్తుండగానే.. ఈప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading