హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: గణేష్‌ మండపాల్లో లడ్డూ , హుండీ, నోట్ల దండలు మాయం .. చేసిందెవరో మీరే చూడండి

OMG: గణేష్‌ మండపాల్లో లడ్డూ , హుండీ, నోట్ల దండలు మాయం .. చేసిందెవరో మీరే చూడండి

GANESH THIEVES

GANESH THIEVES

OMG: అందరూ వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల్లో నిమగ్నమైతే .. దొంగలు మాత్రం తమ వృత్తి ధర్మాన్ని మరువడం లేదు. ఇదే మంచి సీజన్‌ అనుకొని ప్రతి గణేష్‌ మండపంపై ఓ కన్నేసి ఉంచారు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో దొంగలు మండపాల్లో ఏం ఎత్తుకెళ్లారో తెలుసా.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Siddipet, India

  (K.Veeranna,News18,Medak)

  అందరూ వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల్లో నిమగ్నమైతే .. దొంగలు మాత్రం తమ వృత్తి ధర్మాన్ని మరువడం లేదు. ఇదే మంచి సీజన్‌ అనుకొని ప్రతి గణేష్‌ మండపం(Ganapati mandapam)పై ఓ కన్నేసి ఉంచారు. విగ్రహాన్ని ఎత్తుకెళ్లడం సాధ్యపడే విషయం కాకపోవడంతో గణనాథుడికి అలంకరించిన కరెన్సీ నోట్ల దండలు, మహాప్రసాదంగా భావించే లడ్డూ, విలువనై సామాగ్రిని ఎత్తుకెళ్లేందుకు స్కెచ్ వేసి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలోని సిద్దిపేట(Siddipet), సంగారెడ్డి(Sangareddy)జిల్లాల్లో గణేష్‌ చవితి ఉత్సవాల్లో చోర కళాకారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించి సీసీ కెమెరా(CC camera)లకు అడ్డంగా బుక్కయ్యారు.

  Hyderabad: రాత్రి ప‌ది గంటల తర్వాత హైద‌రాబాదీలు స్విగ్గీలో ఏం ఆర్డ‌ర్ పెడుతున్నారో తెలుసా..?  కరెన్సీ నోట్ల దండ మాయం..

  చవితి తొమ్మిది రోజులు కాలనీలు, గల్లీలు, బస్తీలు అనే తేడా లేకుండా గణేష్ చవితి ఉత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. విఘ్నాలు తొలగించాలని వేడుకుంటూ మండపాలు వేసి విగ్రహాలు పెట్టి తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో పోచమ్మ గుడి ఆవరణలో ప్రతిష్టించిన వినాయకుడికి మొదటి రోజు భక్తులు డబ్బుల దండ వేసి తమ భక్తిని చాటుకున్నారు. అయితే మొదటి రోజు వినాయక విగ్రహం మెడలో వేసిన డబ్బుల దండతో పాటు హుండీని దొంగిలించిన విషయాన్ని రెండో రోజు వినాయక మండప నిర్వహకులు గుర్తించారు.

  సీసీ కెమెరాలో రికార్డ్ ...

  ఎవరికి తెలియకుండా మండపం వద్ద సిసి కెమెరాను ఏర్పాటు చేశారు. రెండవ రోజు కూడా భక్తులు వినాయకుడికి డబ్బుల దండ వేశారు. ఆ డబ్బుల దండ రాత్రి వేళ అలాగే వినాయకుడి విగ్రహానికి ఉంచారు నిర్వాహకులు. మూడవరోజు ఉదయం వచ్చి చూడగా డబ్బుల దండ మాయమైంది. చోరీ జరుగుతోందని ముందే ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను పరిశీలించి చూడగా అందులో గుర్తుతెలియని యువకుడు వినాయక విగ్రహం మెడలో డబ్బుల దండను దొంగతనం చేస్తున్న తతంగం రికార్డు అయింది. ఈ రెండు చోరీల్లో మొత్తం 5,వేలు చోరీకి గురైనట్లు నిర్వాహకులు తెలిపారు.గతేడాది కూడా కోహెడ సీతారామచంద్రస్వామి, సాయిబాబా టెంపుల్‌ తాళాలు పగులగొట్టి హుండీతో పాటు, దేవునికి సంబందించిన ఇతర సామగ్రిని దొంగిలించుకెళ్లారు. ఇదంతా కోహెడ మండలం వింజపల్లి గ్రామానికి చెందిన యువకుడే చేసి ఉంటాడని నిర్వహకులు అనుమానిస్తున్నారు. పోలీస్ కేసు పెట్టారు.


  లడ్డూ దొంగలు..

  సిద్దిపేటలో నోట్ల దండ మాయం చేస్తే ..సంగారెడ్డి జిల్లా అమీన్పూర్‌ మండలం కిష్టారెడ్డిపేట్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం దగ్గర స్వామివారి లడ్డూ మాయం చేశారు దొంగలు. ఎంతో విశిష్టంగా తయారు చేయించిన గణపతి లడ్డును దొంగిలించడం కోసం చేసిన ప్రయత్నాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Crime news, Ganesh Chaturthi​ 2022, Sangareddy, Siddipet, Telangana News

  ఉత్తమ కథలు