SC APPOINTS RETIRED JUDGE RAKESH JAIN TO MONITOR LAKHIMPUR VIOLENCE PROBE ALSO INCLUDES 3 IPS OFFICERS IN SIT MKS
lakhimpur : ఇక జడ్జి పర్యవేక్షణలో రైతులపై హింస కేసు దర్యాప్తు : సుప్రీంకోర్టు ఆదేశం -సిట్‌లోకి మరో 4ఐపీఎస్‌లు
లఖీంపూర్ కేసులో సుప్రీం కీలక ఆదేశాలు
ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతులపై జరిగిన హింసాకాండపై దర్యాప్తును పర్యవేక్షించేందుకు పంజాబ్ హైర్యానా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రాకేశ్ కుమార్ జైన్‌ను సుప్రీంకోర్టు నియమించింది. సిట్ బృందంలోనూ సుప్రీంకోర్టు కీలక మార్పులు చేసింది..
ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) లో రైతులపై జరిగిన హింసాకాండపై దర్యాప్తును పర్యవేక్షించేందుకు పంజాబ్ హైర్యానా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రాకేశ్ కుమార్ జైన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) నియమించింది. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న యూపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు సంబంధించి కూడా ఉన్నత న్యాయ స్థానం కీలక మార్పులు చేసింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో యూపీ ప్రభుత్వంపై అడుగడుగునా అనుమానాలు వ్యక్తం చేస్తుండటం తెలిసిందే..
సంచలనం రేపిన లఖీంపూర్ హింస కేసును సుమోటోగా విచారిస్తోన్న సుప్రీంకోర్టు.. యూపీ సర్కారుకు పలు మార్లు గడువిచ్చినా సరైన నివేదికలు సమర్పించకపోవడంతో చివరికి తాను సూచించిన జడ్జితోనే విచారణ చేయించేందుకు సిద్దమైంది. జస్టిస్ రాకేశ్ జైన్ పర్యవేక్షణలో దర్యాప్తునుకు అంగీకరిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం చెప్పడంతో ఆ మేకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసు దర్యాప్తులో పారదర్శకత, నిజాయితీ ఉండేవిధంగా ఆయన పర్యవేక్షిస్తారని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఇక,
లఖీంపూర్ కేసును దర్యాప్తు చేస్తోన్న యూపీ సిట్ లో కూడా సుప్రీం కోర్టు కీలక మార్పులు చేసింది. సిట్ లోకి అదనంగా మరో నలుగురు ఐపీఎస్ అధికారులను కోర్టు నియమించింది. అయితే, ఆ అధికారులు యూపీ కేడర్ కు చెందినప్పటికీ, స్థానికేతరులు అయి ఉండాలని కోర్టు కండిషన్ పెట్టింది. తద్వారా స్థానికంగా తలెత్తే రాజకీయ ఒత్తిళ్లను నివారించాలన్నదే తమ ఉధ్దేశమని కోర్టు పేర్కంది.
యూపీలోని లఖింపూర్ ఖేరీలో అక్టోబరు 3న.. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనపై కొందరు రైతులు సాగు చట్టాలపై నిరసన తెలిపారు. బీజేపీ శ్రేణులు, రైతులకు మధ్య చోటుచేసుకున్న హింసాకాండలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు రైతులు ఉన్నారు. ఈ కేసు నిందితుల్లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా కూడా ఉన్నారు. అశిష్‌కు, మరో ఇద్దరికి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు బెయిలును మంగళవారం నిరాకరించింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.