భార్య ఇంట్లో లేని సమయంలో పనిమనిషిని అతిదారుణంగా... తెలంగాణ యువతికి...

అగ్రిమెంట్ ప్రకారం ఓ సౌదీ షేక్ ఇంట్లో పనిమనిషిగా చేరిన తెలంగాణ యువతి... భార్య ఇంట్లో లేని సమయంలో లైంగికంగా వేధిస్తూ, మానసికంగా క్షోభ పెడుతున్న యజమాని...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 15, 2019, 6:05 PM IST
భార్య ఇంట్లో లేని సమయంలో పనిమనిషిని అతిదారుణంగా... తెలంగాణ యువతికి...
భార్య ఇంట్లో లేని సమయంలో పనిమనిషిపై దారుణంగా...
  • Share this:
బతుకెతెరువు కోసం పుట్టినఊరునీ, కన్నవారినీ వదిలి సౌదీ చేరిన ఓ యువతి, అక్కడ శాడిస్టు యజమాని చేతిలో నరకం అనుభవిస్తోంది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 24 ఏళ్ల లావణ్య... బతుకుతెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లింది. అక్కడ అగ్రిమెంట్ ప్రకారం ఓ సౌదీ షేక్ ఇంట్లో పనిమనిషిగా చేరింది. అయితే అతను లావణ్యపై కన్నేశాడు. భార్య ఇంట్లో లేని సమయంలో ఆమెను శారీరకంగా లొంగదీసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించాడు. అయితే ఎంతకీ లావణ్య ఆ పనికి ఒప్పుకోకపోవడంతో ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలెట్టాడు. భార్య లేని సమయంలో చేయని తప్పులు ఆమెపై మోపుతూ శారీరకంగా హింసించేవాడు. కొరడాతో కొడుతూ చిత్రహింసలు పెట్టడం మొదలెట్టాడు. అయితే కుటుంబం కోసం అతని వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చింది లావణ్య. అయితే రోజురోజుకీ యజమాని చిత్రహింసలు పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియక... యజమాని చేస్తున్న దారుణాలను వాట్సాప్ వీడియో ద్వారా కుటుంబసభ్యులకు తెలియచేసింది. తనకు ఈ రాక్షసుడి నుంచి కాపాడాలంటూ వారిని వేడుకుంది.

దేశం కాని దేశంలో ఉన్న కూతుర్ని ఎలా కాపాడుకోవాలో తెలియని ఆమె కుటుంబసభ్యులు... భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను వేడుకుంటున్నారు. ఆమె స్పందించి రియాద్‌లోని భారత రాయభార కార్యాలయానికి సమాచారం ఇచ్చింది. అయితే సౌదీ నియమ నిబంధనల ప్రకారం పనిలో చేరేటప్పుడు రాసుకున్న అగ్రిమెంట్ గడువు ముగియకుండా స్వదేశానికి వెళ్లడం కుదరదు. ఇలా వెళ్లాలంటే లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. చిత్రహింసలపై ఫిర్యాదు చేద్దామంటే సదరు యజమాని అక్కడ ఓ బాధ్యతాయుత అధికారి అని తెలిసింది. దాంతో వారు కూడా ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయారు.


First published: May 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>