Saudi Arabia Restaurant Preparing Samosas In Toilet: ప్రస్తుతం చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్ లలో కనీస శుభ్రతను పాటిచడం లేదు. హోటల్ నిర్వాహకులు పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో కస్టమర్ లకు ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. అదే విధంగా అక్కడ ఆహార పదార్థాలను తయారు చేయడానికి నాణ్యమైన సరుకులను కూడా ఉపయోగించరు. కేవలం తక్కువ ధరకు వచ్చే పదార్ధాలను ఉపయోగిస్తారు. ఇప్పటికే అనేక హోటళ్లలో కస్టమర్ లు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారు ఆర్డర్ చేసిన ఫుడ్ లో.. బూజు, బొద్దింకలు, బల్లుల అవశేషాలు వచ్చిన అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి.
అయితే, అధికారులు ఏదైన జరగ్గానే థూ.. థూ మంత్రంగా తనిఖీలు చేస్తారు. కొన్ని రోజులు హడావీడి చేస్తారు. నోటీసులు జారీచేస్తారు. తర్వాత.. వారికి మాముళ్లు అందగానే చూసిచూడనట్టు వదిలేస్తారు. ఇలాంటి పదార్థాలు తిని కస్టమర్లు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు మనం ప్రతి రోజు వార్తలలో చూస్తునే ఉంటాం. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం మరోసారి వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. సౌదీ అరేబియాలో ఒక హోటల్ ఉంది. అక్కడ పూర్తిగా అపరిశుభ్ర వాతావరణం ఉంది. ఈ క్రమంలో కొంత కాలంగా స్థానికులు అక్కడి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో అక్కడ అధికారులు తనిఖీలు చేపట్టారు. వారి తనిఖీలలో అధికారులకు దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి. అక్కడి హోటల్ లో.. 30 ఏళ్లుగా టాయ్ లేట్ లోనే సమోసాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా, వాష్ రూమ్ లో భోజనాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అక్కడ ఎలుకలు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు ఉండటాన్ని అధికారులు చూశారు. ఇక అక్కడ పనిచేస్తున్న పనివారు.. తినే పదార్థాలు తయారు చేస్తున్న గది పక్కనే తమ కాల కృత్యాలు తీర్చుకుంటుండటాన్ని గుర్తించారు.
దీంతో అధికారులు షాకింగ్ కు గురయ్యారు. దీంతో హోటల్ సిబ్బందికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడి హోటల్ ను మూసివేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అక్కడి హోటల్ కు సీల్ వేశారు. హోటల్ లో పనిచేసే వారికి కనీస నివాస సదుపాయాలు కూడా లేవు. కార్మికులకు ఎలాంటి హెల్త్ కార్డులు, బెనిఫిట్ లు కానీ నిర్వాహకులు కల్పించలేదు. అయితే, గతంలో కూడా అధికారులు.. జెడ్డాలో తనిఖీలు చేశారు. అక్కడి షావర్మా రెస్టారెంట్ లో ఇలాంటి వాతావరణం ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అప్పట్లో ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో సౌదీ అరేబియాలో హోటల్ ల నిర్వాకం మరోసారి వార్తలలో నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food, Preparation, Saudi Arabia, Toilet