Home /News /crime /

SAUDI ARABIA LAW THEORETICALLY ALLOWS THE DEATH PENALTY FOR THESE 12 CRIMES FULL DETAILS HERE HSN

Saudi Arabia: ఈ 12 నేరాలు చేస్తే సౌదీ అరేబియాలో తల తెగిపోద్ది.. జాబితాలో స్వలింగ సంపర్కం, వ్యభిచారం కూడా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కఠినమైన చట్టాలను అమలు చేసే దేశంగా సౌదీ అరేబియాకు పేరున్న సంగతి తెలిసిందే. మొన్నమొన్నటి వరకు కూడా ఆ దేశంలో స్త్రీలు కార్లు నడిపేందుకు అనుమతి లేదు. అక్కడ కొన్ని రకాల నేరాలకు బహిరంగంగా తల నరికేస్తారు. ఆ నేరాలేంటో ఓ లుక్కేయండి.

    గల్ఫ్ దేశమయిన సౌదీలో చట్టాలను చాలా కఠినంగానే అమలు చేస్తారన్న సంగతి తెలిసిందే. అక్కడ తేడాలొస్తే తల తీసేస్తారు అంటూ సౌదీ అరేబియాకు వలస వెళ్లిన తెలుగు కార్మికులు చెప్పుకుంటుంటారు. భారత్ లోనూ, ఇతర దేశాల్లోనూ చిన్న చిన్నవిగా కనిపించిన తప్పులకే సౌదీలో మరణ శిక్షను అమలు చేస్తుంటారు. సౌదీలో రాచరిక పాలనే జరుగుతోందని అందరికీ తెలిసిందే. షరియా చట్టాలను అమలు చేసే సౌదీలో, నేరాల స్థాయి చాలా చాలా తక్కువని రికార్డులు చెబుతున్నాయి. అంత కఠిన స్థాయిలో చట్టాలను అమలు చేయడం వల్లే క్రైమ్ రేట్ తక్కువగా ఉంటుందని అంతా భావిస్తుంటారు. అయితే రికార్డులకెక్కని నేరాలు కూడా సౌదీ అరేబియాలో పెద్ద సంఖ్యలోనే ఉంటాయని కూడా చెబుతుంటారు. సౌదీ అరేబియాలో కొన్ని రకాల తప్పులకు మరణ శిక్షను విధిస్తుంటారు. అవేంటో ఓ లుక్కేయండి.

    బహిరంగంగా తల నరకడమో, బహిరంగంగా ఉరి తీయడం ద్వారా, రాళ్లతో కొట్టి చంపడం ద్వారా కానీ సౌదీ అరేబియా సర్కారు మరణ శిక్షలను అమలు చేస్తుంటుంది. అత్యధికంగా మరణ శిక్షలను విధించిన దేశంగా కూడా సౌదీకి ఓ రికార్డు ఉంది. 2015 వ సంవత్సరంలో 158 మందికి, 2016వ సంవత్సరంలో 154 మందికి, 2017వ సంవత్సరంలో 146 మందికి, 2018వ సంవత్సరంలో 149 మందికి, 2019వ సంవత్సరంలో ఏకంగా 184 మందికి సౌదీలో మరణశిక్షను అమలు చేసినట్టు రికార్డులుచెబుతున్నాయి. ఏఏ తప్పులకు మరణ శిక్షను విధించాలన్న దానిపై సౌదీ అరేబియా ముందుగానే ఓ జాబితాను సిద్ధం చేసుకుంది. ఆ నేరం కనుక చేసి పట్టుబడితే ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఆ నేరాలేంటంటే..
    ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

    1. మత మార్పిడి (ఇస్లాం మతం నుంచి వేరే మతంలోకి మారినా, మార్చుతున్నా మరణ శిక్ష విధిస్తారు)
    2. దేశద్రోహం (దేశ రహస్యాలను శత్రుదేశాలకు వెల్లడించినా మరణ శిక్ష విధిస్తారు)
    3. స్వలింగ సంపర్కం
    4. గూఢచర్యం
    5. హత్య
    6. అత్యాచారం
    7. ఉగ్రవాద కార్యకలాపాలు జరిపినా మరణ శిక్ష విధిస్తారు
    8. డ్రగ్స్ స్మగ్లింగ్
    9. ఇస్లాం మతాన్ని దూషించినా, దైవ దూషణకు పాల్పడినా
    10. దోపిడీలు, దొంగతనాలు కూడా మరణ శిక్ష కిందకే వస్తాయి. (అతి తీవ్రమయిన కేసుల్లో మాత్రమే మరణశిక్షను విధించిన దాఖలాలు ఉన్నాయి)
    11. వ్యభిచారం (పెళ్లి కాని వారికి కొరడా దెబ్బలతోనూ, పెళ్లయిన వారిని రాళ్లతో కొట్టి శిక్ష విధిస్తారు)
    12. మంత్రవిద్యలు (చేతబడి, బాణామతి వంటివి)

    అయితే ఈ తరహా తప్పులు చేసినప్పటికీ, నేరం రుజువు అయినప్పటికీ మరణ శిక్ష నుంచి వెసులుబాటు పొందే అవకాశం కొందరికి ఉంది. గర్భవతులు, చిన్న పిల్లలు కలిగిన స్త్రీలు, మానసికంగా అనారోగ్యం కలిగిన వాళ్లు ఈ శిక్షల నుంచి విముక్తి పొంద వచ్చు. అదే సమయంలో కొన్ని రకాల నేరాల్లో Blood Money విధానం ద్వారా కూడా విముక్తులు కావచ్చు. అంటే బాధితులు కోరినంత డబ్బును ఇచ్చి వారి క్షమాభిక్ష ద్వారా కూడా మరణ శిక్ష నుంచి విముుక్తి పొందొచ్చు.
    ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime, Crime news, Crime story, CYBER CRIME, Death penalty, Saudi Arabia

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు