సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. సర్పంచ్ సహా ముగ్గురు మృతి

కారు ముందు భాగంగా కారు కిందకు దూసుకెళ్లడంతో నుజ్జునుజ్జయింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమింగా భావిస్తున్నారు.

news18-telugu
Updated: September 3, 2020, 10:17 AM IST
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. సర్పంచ్ సహా ముగ్గురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులను మంచిర్యాల జిల్లాలకు చెందిన అంజిబాబు, ఇడిదినేని గణేష్, అంగల సాయిగా గుర్తించారు. వీరిలో అంజిబాబు తాండూర్ గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తున్నారు. మంచిర్యాల నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అతివేగంతో లారీని ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్ర ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు. కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లడంతో నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రొక్లెయినర్ సాయంతో కారును బయటకు లాగారు. మృతదేహాలను పోస్టుమార్టం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమింగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సర్పంచ్ అంజిబాబు మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

కాగా, బుధవారం వరంగల్ జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్‌ వద్ద ఇసుక లారీ కారును ఢీకొట్టింది. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు మరణించారు.
Published by: Shiva Kumar Addula
First published: September 3, 2020, 10:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading