Home /News /crime /

SANKRANTHI 2020 ONE PERSON DIED IN WEST GODAVARI COCK FIGHT SK

సంక్రాంతి కోడిపందేల్లో విషాదం.. కోడికత్తి తగిలి వ్యక్తి మృతి

ప్రతీకాత్మక చిత్రం..

ప్రతీకాత్మక చిత్రం..

కోళ్ల కాళ్లకు కత్తులు కడుతున్న సమయంలో 55 ఏళ్ల వెంకటేశ్వరరావు అక్కడ నిలబడ్డాడు. కత్తి కట్టిన తర్వాత కోడి ఒక్కసారిగా కాళ్లను విదిలించడంతో ఆ కత్తి వెంకటేశ్వరరావుకు గుచ్చుకుంది.

    సంక్రాంతి పండగ వేళ ఏపీలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. గోదావరి పల్లెల్లో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఐతే పశ్చిమ గోదావరి జిల్లా చింతపూడి మండలంలో కోడి పందేల్లో విషాదం చోటు చేసుకుంది. కోడికత్తి తగిలి ఒకరు చనిపోయారు. ప్రగడవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. సంక్రాంతి సందర్భంగా గ్రామ శివారులోని పామాయిల్ తోటల్లో కోడి పందేలు ఏర్పాటు చేశారు. కోళ్ల కాళ్లకు కత్తులు కడుతున్న సమయంలో 55 ఏళ్ల వెంకటేశ్వరరావు అక్కడ నిలబడ్డాడు. కత్తి కట్టిన తర్వాత కోడి ఒక్కసారిగా కాళ్లను విదిలించడంతో ఆ కత్తి వెంకటేశ్వరరావుకు గుచ్చుకుంది. పదునైన కత్తి దిగడంతో తొడ భాగంలో పెద్ద గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో అగడు అక్కడే కుప్పకూలాడు. స్థానికులు హుటాహుటిన అతడిని చింతలపూడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: AP News, Cock fight, Sankranti, West Godavari

    తదుపరి వార్తలు