హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime news : భర్తకు విడాకులు ఇప్పించాడు .. ఆ తర్వాత ఆమెను ప్రియుడు ఏం చేశాడో తెలుసా..!  

Crime news : భర్తకు విడాకులు ఇప్పించాడు .. ఆ తర్వాత ఆమెను ప్రియుడు ఏం చేశాడో తెలుసా..!  

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime news: వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ప్రియురాలిని మోసం చేశాడు ఆమె ప్రియుడు. భర్తకు విడాకులు ఇస్తే తాను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఆమెను అభాగ్యురాలిని చేశాడు. భర్తను వదిలి..ప్రియుడి మాటలకు మోసపోయిన బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కింది.  

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi)

(K.Veeranna,News18,Medak)

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం జరిగిన తర్వాత కూడా ప్రేమికులు తరచూ ఫోన్‌(Phone)లో మాట్లాడుకోవడం, చాటింగ్ (Chatting)చేసుకోవడంతో మళ్లీ ఇద్దరూ క్లోజ్‌ అయ్యారు. ఆసమయంలోనే యువతి ప్రియుడ్ని పెళ్లి చేసుకోమని కోరింది. నీ భర్తకు విడాకులు(Divorce)ఇచ్చి వస్తే చేసుకుంటానని చెప్పాడు. తీరా ప్రియుడి మాటలు నమ్మి వచ్చిన ఆమెను అతను ఏం చేశాడో తెలుసా.

Telangana : పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం .. ఐదుగురు కార్మికులు మృతిమోసపోయిన వివాహిత..

సంగారెడ్డి జిల్లాలో పెళ్లి చేసుకుంటానని వివాహితను ఆమె ప్రియుడే మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన మేతరి శైలజ అదే గ్రామానికి చెందిన ఆంజనేయగౌడ్ ప్రేమించుకున్నారు. విషయం తెలిసిన శైలజ తల్లిదండ్రులు ఆమెకు జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) గ్రామానికి చెందిన గౌని నగేశ్‌తో ఈ సంవత్సరం మే నెలలో వివాహం జరిపించారు. ఇది జరిగిన తర్వాత కూడా శైలజను ప్రియుడు ఆంజనేయ గౌడ్ తరచూ ఫోన్‌లో మాట్లాడటం, చాటింగ్ చేస్తూ వచ్చాడు. ఇద్దరి మధ్యఉన్న క్లోజ్ రిలేషన్‌తో శైలను భర్తకు విడాకులు ఇస్తే తాను పెళ్లి చేసుకుంటానని అంజనేయగౌడ్‌ నమ్మబలికాడు.

ప్రియుడి కోసం భర్తను వదిలి..

ఈవిషయం శైలజ భర్త , తల్లిదండ్రులకు తెలియడంతో గట్టిగా మందలించారు. ఆ తర్వాత పెద్దల పంచాయితీలో భర్తతో విడాకులు తీసుకునేందుకు శైలజ సిద్ధమైంది. ప్రియుడు అంజనేయగౌడ్‌ కూడా పెళ్లి చేసుకోవడానికి అదే షరతు పెట్టడంతో నమ్మింది బాధితురాలు. భర్తతో విడాకులు తీసుకునేందుకు శైలజ ఒప్పంద పత్రం కూడా రాయించుకుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న యువతి ఇంట్లో వాళ్లను కాదని...వారి మాటను లెక్క చేయకుండా ప్రియుడితో జీవితం గడపాలని డిసైడ్ అయింది. అటుపై ఈనెల 22న ఆంజనేయగౌడ్ కు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.

Telangana : రగులుతున్న పోడు పోరు .. గిరిజనుల పంట పొలాలు ధ్వంసంహ్యాండిచ్చిన ప్రియుడు..

ఈనెల 24వ తేదీన శైలజ ఆంజ నేయగౌడ్ ఇంటికి వెళ్లింది. ఆంజనేయగౌడ్ తల్లి ఛాయమ్మ, వదిన భాగ్యలక్ష్మి, సోదరులు శంకర్, వీరేశం, కృష్ణ శైలజను కులంపేరుతో దూషించి బెదిరించారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు రాయికోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడు ఆంజనేయులుతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు.

First published:

Tags: Lover cheating, Sangareddy, Telangana crime news

ఉత్తమ కథలు