అత్యాచారం కేసులో జీవిత ఖైదు.. సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంగారెడ్డి మొదటి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ సంచలన తీర్పు వెలువరించారు. దోషికి జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించారు.

news18-telugu
Updated: December 3, 2019, 7:57 PM IST
అత్యాచారం కేసులో జీవిత ఖైదు.. సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంగారెడ్డి మొదటి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ సంచలన తీర్పు వెలువరించారు. దోషికి జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించారు. 2015 జనవరి 6న సంగారెడ్డి జిల్లా, కంగ్టి మండలంలోని గాజులపాడ్ గ్రామంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బాధితురాలు తన ఇంట్లో పడుకొని ఉండగా బైదొడ్డి నాగయ్య అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమె అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కంగ్టి ఎస్ఐ కేసునమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఈ కేసుపై నారాయణఖేడ్ CI ముని గారు విచారణ చేపట్టి నేరస్తునికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాదారాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. దీనిపై విచారణ జరిపిన మొదటి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ పాపయ్య నిందితుడు నాగయ్యను దోషిగా తేల్చి జీవితకాల కారాగార శిక్ష విధించారు. కోర్టులో బాదితురాలి తరపున పబ్లిక్ ప్రాసెక్యూటర్ J. శ్రీనివాస్ రెడ్డి గారు బలమైన వాదనలు వినిపించి నేరస్తునికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించారు. కోర్టులో సాక్షులు సరయిన విధంగా సాక్ష్యం చెప్పడంలో కోర్ట్ లైజనిగ్ ఆఫీసర్ ప్రభాకర్ సహకరించారు.

కాగా, శంషాబాద్ దిశా రేప్ అండ్ మర్డర్ కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. పశు వైద్యురాలిని గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా చంపిన నలుగురు నిందితులను ఉరితీయాలని ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రేప్ కేసు దోషికి యావజ్జీవ కారాగారశిక్ష విధించడంపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే దిశా కేసు నిందితులకు ఉరి శిక్ష విధించాలని కోరుతున్నాయి.First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>