సమత కేసులో తుది తీర్పు ఈ నెల 30కి వాయిదా..

సమత హత్యాచారం కేసును ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు ప్రాసిక్యూషన్‌ తెలిపింది.

news18-telugu
Updated: January 27, 2020, 12:04 PM IST
సమత కేసులో తుది తీర్పు ఈ నెల 30కి వాయిదా..
సమత కేసులో తుది తీర్పు ఈ నెల 30కి వాయిదా..
  • Share this:
సమత హత్యాచారం కేసును ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు ప్రాసిక్యూషన్‌ తెలిపింది. న్యాయమూర్తి అనారోగ్యంతో సెలవుపై వెళ్లినట్లు ప్రాసిక్యూషన్‌ వెల్లడించింది. దీంతో తుది తీర్పును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రాసిక్యూషన్‌ ధర్మారెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే సోమవారం ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టులో తుది తీర్పు వెల్లడికి షెడ్యూల్‌ ఖరారు చేశారు. కానీ, న్యాయమూర్తి అనారోగ్యానికి గురవడంతో తీర్పు వాయిదా పడింది. నవంబర్ 24 , 2019న తేదిన లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగింది. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే బాధితురాలు ఒంటరిగా ఉండటం గమనించి ముగ్గురు వ్యక్తులు అపహరించారు. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక హత్యాచారం హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ కేసు విచారణను తీవ్రంగా పరిగణించిన పోలీసులు 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. డిసెంబర్ 14న ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు.

First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు