మొబైల్ షోరూంలో దొంగలు...సేల్స్ గర్ల్‌ను హత్య చేసి...

ఇద్దరు అనుమానితులు మధ్యాహ్నం 11.45 గంటల సమయంలో షాపులోకి ప్రవేశించి పవర్ బ్యాంకు కొంటామని బేరం ఆడటం ప్రారంభించారు. అయితే కాసేపటికే నిందితులు పింకీ రావత్‌కు కత్తి చూపించి కౌంటర్ లోని డబ్బు అలాగే ఖరీదైన ఫోన్లను తమకు ఇచ్చేయాలని లేదంటే కత్తితో పొడుస్తామని బెదిరించారు.

news18-telugu
Updated: October 19, 2019, 4:07 PM IST
మొబైల్ షోరూంలో దొంగలు...సేల్స్ గర్ల్‌ను హత్య చేసి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తరాఖండ్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఓ మొబైల్ షోరూంలోకి చొరబడిన దొంగలు అక్కడ పనిచేసే సేల్స్ అమ్మాయిని హతమార్చి భారీ ఎత్తున డబ్బు, మొబైల్ ఫోన్స్ దోపిడీ చేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే ఉత్తరాఖండ్‌లోని సింగ్‌నగర్ జిల్లా కాశీపూర్ ప్రాంతంలో పింకీ రావత్ స్థానిక మనీష్ చావ్లా మొబైల్ షోరూంలో సేల్స్ అమ్మాయిగా పనిచేస్తోంది. అయితే ఈ క్రమంలో గత వారం ఎప్పటిలాగే ఉదయం షాప్ తెరిచి సేల్స్ ప్రారంభించిన పింకీ రావత్‌ తన పనిలో నిమగ్నమైంది. ఇంతలో ఇద్దరు అనుమానితులు మధ్యాహ్నం 11.45 గంటల సమయంలో షాపులోకి ప్రవేశించి పవర్ బ్యాంకు కొంటామని బేరం ఆడటం ప్రారంభించారు. అయితే కాసేపటికే నిందితులు పింకీ రావత్‌కు కత్తి చూపించి కౌంటర్ లోని డబ్బు అలాగే ఖరీదైన ఫోన్లను తమకు ఇచ్చేయాలని లేదంటే కత్తితో పొడుస్తామని బెదిరించారు.

దీంతో పింకీ రావత్ చుట్టుపక్కల వాళ్లను పిలిచి నిందితులను పట్టించాలని ప్రయత్నం చేసింది. అయితే ఇంతలో నిందితులు పింకీ కడుపులో కత్తితో పోట్లు పొడిచారు. దీంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది. రక్తపు మడుగులో ఉన్న పింకీని అలాగే వదిలేసి షాపులోని లక్షరూపాయల నగదుతోపాటు, 11 ఖరీదైన మొబైల్ ఫోన్లతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

First published: October 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading