SAIDABAD RAJU UNCLE SAID THAT HIS DAUGHTER FACED ABORTION THREE TIMES BECAUSE RAJU KICKED HIS DAUGHTER PRV
Saidabad Raju: కడుపుతో ఉన్న తన కూతురిని రాజు తన్నితే మూడుసార్లు గర్భం పోయిందన్న సైదాబాద్ రాజు మామయ్య
సైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడు రాజు (File)
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకుని తిరిగిన రాజు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య (suicide) చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. అయితే రాజు గురించి ఆయన మామయ్య వెంకన్న మరికొన్నివిషయాలు బయటపెట్టాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ కీచకుడు రాజు (saidabad raju) ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకుని తిరిగిన రాజు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య (suicide) చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. అయితే రాజు గురించి ఆయన మామయ్య వెంకన్న మరికొన్నివిషయాలు బయటపెట్టాడు. రాజ ఉన్మాదిలా ప్రవర్తించేవాడని అన్నాడు. ఇంకా పలు విషయాలు వెల్లడించాడు.
రాజు తన బిడ్డను ప్రేమ వివాహం (love marriage) చేసుకున్నాడని అన్నాడు. పెళ్లైన ఎనిమిది సంవత్సరాలకు తన బిడ్డకు పాప (daughter) పుట్టిందన్నారు. కడుపుతో ఉన్నతన బిడ్డను తన్నితే మూడు సార్లు అబార్షన్ (Abortion) అయిందని వెంకన్న వాపోయాడు. తను ఇంకా చిన్నవాడినేనని తనకు ఇప్పుడే పిల్లలు వద్దు అనే వాడని వెంకన్న తెలిపాడు. అయితే రాజు మాత్రం క్రూరంగా ప్రవర్తించేవాడని అన్నాడు. పోలీసులు మాత్రం తమను ఇబ్బందులకు గురిచేయలేదని వెల్లడించాడు.
అసలేం జరింగింది?
హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై (Saidabad Rape Case) అత్యాచారం, హత్య కేసు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి తొలుత బాలిక అనుమానస్పద స్థితిలో మృతిచెందిందని భావించారు. కానీ తల్లిదండ్రులు అనుమానంతో కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక ఇంటికి పక్కనే ఉండే రాజు అనే వ్యక్తి బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేసినట్టుగా తేలింది. ఆ తర్వాత ఈ ఘటన పెను సంచలనంగా మారింది.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. అదే స్థాయిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని స్థానికులు, ప్రతిపక్ష నాయకులు నిరసలు తెలిపారు. ధర్నాలు చేపట్టారు. పోలీసులు కూడా నిందితుడు రాజు ఆచూకీ తీవ్రంగా గాలించారు. అతడిని పట్టించిన వారికి రూ. 10 లక్షల రివార్డు ప్రకటించారు.
అయితే చివరకు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ ఘన్పూర్ సమీపంలోని నాష్కల్ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. వారం రోజులుగా పోలీసులకు కనిపించకుండా తిరిగిన నిందితుడు రాజు మృతదేహాన్ని స్టేషన్ ఘన్పూర్ సమీపంలోని నాష్కల్ రైల్వే ట్రాక్‌పై గుర్తించారు. ఈ విషయాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ధ్రువీకరించారు. స్టేషన్ ఘన్పూర్ వద్ద మృతదేహాన్ని గుర్తించామని.. నిందితుడి శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా ఐ నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ వైపు వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కింద పడి రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పినట్టుగా తెలుస్తోంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.