హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Telangana: ఇద్దరు యువతుల మధ్య ప్రేమాయణం..ఆపై సహజీవనం..మూడో వ్యక్తి ఎంట్రీతో..

Telangana: ఇద్దరు యువతుల మధ్య ప్రేమాయణం..ఆపై సహజీవనం..మూడో వ్యక్తి ఎంట్రీతో..

ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమేంట్రా బాబు?

ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమేంట్రా బాబు?

Sad Love Story Of Two Girls: ప్రేమ..ఎప్పుడు..ఎక్కడ..ఎలా..ఎవరి మధ్య పుడుతుందో ఎవరూ చెప్పలేరు. చాలా మంది ప్రేమ స్నేహం నుంచే మొదలై చివరకు ప్రేమతో పెళ్ళికి దారి తీస్తున్నాయి. అయితే పెళ్లి చేసుకున్న కొందరి జీవితాలు సాఫీగా సాగుతుంటే..మరికొందరు జీవితాలు ఊహించని ఘటనలతో విషాదంతంగా మారిన సందర్భాలున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో ట్రాన్స్ జెండర్స్ ను పెళ్లి చేసుకున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. అలాగే అబ్బాయిలు అబ్బాయిలతో అమ్మాయిలు అమ్మాయిలతో ప్రేమలో పడిన విచిత్ర సంఘటనలు కనపడుతున్నాయి. ఇక తాజాగా ఓ ఇద్దరు యువతుల ప్రేమాయణం సినిమాలో సస్పెన్స్ సీన్స్ కు మించి అనేక మలుపులు..ఊహించని ట్విస్టులతో సాగుతూ చివరకు ఎక్కడకు దారి తీసిందంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Adilabad, India

Sad Love Story Of Two Girls: ప్రేమ..ఎప్పుడు..ఎక్కడ..ఎలా..ఎవరి మధ్య పుడుతుందో ఎవరూ చెప్పలేరు. చాలా మంది ప్రేమ స్నేహం నుంచే మొదలై చివరకు ప్రేమతో పెళ్ళికి దారి తీస్తున్నాయి. అయితే పెళ్లి చేసుకున్న కొందరి జీవితాలు సాఫీగా సాగుతుంటే..మరికొందరు జీవితాలు ఊహించని ఘటనలతో విషాదంతంగా మారిన సందర్భాలున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో ట్రాన్స్ జెండర్స్ ను పెళ్లి చేసుకున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. అలాగే అబ్బాయిలు అబ్బాయిలతో అమ్మాయిలు అమ్మాయిలతో ప్రేమలో పడిన విచిత్ర సంఘటనలు కనపడుతున్నాయి. ఇక తాజాగా ఓ ఇద్దరు యువతుల ప్రేమాయణం సినిమాలో సస్పెన్స్ సీన్స్ కు మించి అనేక మలుపులు..ఊహించని ట్విస్టులతో సాగుతూ చివరకు ఎక్కడకు దారి తీసిందంటే..?

Breaking News: విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణలో ఆ ఎగ్జామ్స్ అన్నీ వాయిదా.. అధికారిక ప్రకటన విడుదల

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మన్నెగూడెంకు చెందిన మహేశ్వరి గత కొంతకాలంగా వేషాధారణ అబ్బాయిలాగా ఉంటూ అలాంటి ప్రవర్తన కనబరుస్తుంది. అయితే మందమర్రి మండలం మామిడిగట్టుకు చెందిన అంజలి మన్నెగూడెంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో మహేశ్వరితో అంజలికి పరిచయం ఏర్పడింది. ఆ తరువాత 2 ఏళ్ల క్రితం మంచిర్యాలలోని ఓ గదిలో మహేశ్వరి, ఆమె సోదరి పరమేశ్వరి, సోదరుడు విగ్నేష్ లతో కలసి అంజలి ఉంటుంది. అంజలి స్థానిక ఆప్టికల్ షాప్ లో పని చేస్తుండగా..మహేశ్వరి పెట్రోల్ బంక్ లో పని చేసి మానేసింది.

స్టేట్ లెవల్ కబడ్డీ ప్లేయర్ పాడుపని... బ్యాగ్ లో 500 మత్తు ఇంజెక్షన్లు.. ఎక్కడంటే..

అయితే వీరి స్నేహం క్రమంగా ప్రేమగా మారి ఆపై సహజీవనానికి దారి తీసిందని స్థానికులు చెబుతున్నారు. అయితే మంచిర్యాలకు చెందిన కన్సల్టెన్సీ చేసే శ్రీనివాస్ తో మహేశ్వరికి పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఆమె సోదరి, సోదరుడు, అంజలికి శ్రీనివాస్ పరిచయం అయ్యాడు. అయితే 2 నెలలుగా అంజలి శ్రీనివాస్ తో చనువుగా ఉంటూ మహేశ్వరిని దూరం ఉంచింది. దీనితో మహేశ్వరి తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి పనికి వెళ్లొచ్చిన అంజలిని రూమ్ నుండి రాత్రి 8 గంటల సమయంలో మహేశ్వరి మామిడిగట్టుకు వెళ్తామని తీసుకొని వెళ్ళింది. ఆ తరువాత 11 గంటల సమయంలో మహేశ్వరి శ్రీనివాస్ కు ఫోన్ చేసింది. అంజలి ఆత్మహత్య చేసుకుందని..తాను చేసుకుంటానని శ్రీనివాస్ కు ఫోన్ లో చెప్పింది. దీనితో శ్రీనివాస్ కారులో మహేశ్వరి సోదరి పరమేశ్వరిని తీసుకొని హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అయితే అప్పటికే అంజలి స్పృహలో లేదు. మహేశ్వరి కూడా గాయాలతో ఉంది. అయితే అంజలిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అలాగే అంజలి శరీరంపై గాయాలు ఉండడంతో మహేశ్వరే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేశ్వరి, శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకున్నారు.

First published:

Tags: Crime, Love, Mancherial, Telangana

ఉత్తమ కథలు