RUSSIAN WOMEN SMUGGLED GOLD BISCUITS INSIDE SANITARY NAPKINS MK
అనుమానంతో కస్టమ్స్ అధికారులు మహిళ అండర్ గార్మెంట్స్ విప్పి చూడగానే...
ప్రతీకాత్మక చిత్రం
మహిళా సిబ్బందిని పిలిపించి అనుమానంతో ఆ రష్యన్ మహిళ లోదుస్తుల్లోని శానిటరీ నాప్కిన్స్ లో చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. సుమారు 350 గ్రాముల బంగారం దాచినట్లు బయటపడింది.
పంజాబ్ లోని అమృత్ సర్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ కేసులో ఒక రష్యన్ మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు రష్యన్ మహిళ తన లోదుస్తుల్లోని సానిటరీ ప్యాడ్స్ లో బంగారాన్ని కనపడకుండా అమర్చి జాగ్రత్తగా ఎవరికీ అనుమానం రాకుండా తీసుకువెళ్తోంది. అయితే కస్టమ్స్ అధికారులకు మెటల్ డిటెక్టర్ ద్వారా స్కాన్ చేయగా అనుమానం వచ్చింది. ఎంత వెతికినా స్మగ్లింగ్ చేస్తున్న ఆనవాళ్లు బయటపడలేదు. అయితే మహిళ లోదుస్తుల్లో ఏమి దాచారో చెప్పాలని తెలపగా, అందుకు ససేమిరా అన్నది. దీంతో మహిళా సిబ్బందిని పిలిపించి అనుమానంతో ఆ రష్యన్ మహిళ లోదుస్తుల్లోని శానిటరీ నాప్కిన్స్ లో చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. సుమారు 350 గ్రాముల బంగారం దాచినట్లు బయటపడింది. అంతే కాదు ఆ మహిళ బ్రాలో సైతం బంగారు బిస్కెట్లు దాచినట్లు తేలింది. దీంతో అధికారులు ఆ రష్యన్ మహిళపై అక్రమ రవాణా కేసు నమోదు చేసి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.