గోవాలో రష్యా మహిళపై అఘాయిత్యం... బైక్‌పై వెంటాడి... పగబట్టి...

Goa Crime News : బ్యూటీఫుల్ టూరిజం స్టేట్‌గా గుర్తింపు తెచ్చుకున్న గోవాలోనే యాత్రికులపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఆ రష్యా మహిళకు జరిగిన అన్యాయమేంటి?

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 1:19 PM IST
గోవాలో రష్యా మహిళపై అఘాయిత్యం... బైక్‌పై వెంటాడి... పగబట్టి...
గోవాలో దారుణం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గోవాలోని అదో అర్పోరా గ్రామంలో అదో బ్యూటీఫుల్ టూరిజం ప్లేస్. కాకపోతే... ఎండ ఎక్కువగా ఉండటంతో పర్యాటకులు పెద్దగా లేరు. ఇంకా చెప్పాలంటే దాదాపు నిర్మానుష్యంగా ఉంది. మే 15న అక్కడో ఏటీఎంలో మనీ విత్ డ్రా చేసుకుంది రష్యాకు చెందిన ఇవనోస్కా (పేరు మార్చాం). పర్యాటక ప్రదేశాల్ని చూస్తూ... అలా ముందుకు వెళ్తోందామె. దారిలో ఓ చోట బైక్ పార్క్ చేసి... వైట్ టీ షర్ట్, డార్క్ బ్లూ జీన్స్ వేసుకొని... సిగరెట్ కాల్చుకుంటూ కనిపించాడు గెడ్డంతో రఫ్ అండ్ టఫ్‌గా ఉన్న ఓ కుర్రాడు. అనుకోకుండా అతనివైపు చూసి... తిరిగి మిగతా పర్యాటక ప్రదేశాల్ని చూస్తూ ముందుకి వెళ్లసాగింది ఇవనోస్కా. ఆ కుర్రాడు మాత్రం ఆమె వైపు తీక్షణంగా చూస్తూ... చివరకు వచ్చేసిన సిగరెట్ పీకను కింద పడేసి... దాన్ని కాలితో తొక్కి, నిప్పును ఆర్పకుండానే... బైక్ స్టార్ట్ చేసి ఆమె వెనకే నెమ్మదిగా బయలుదేరాడు. కొన్ని క్షణాలకే ఆమె పక్కకు వచ్చేశాడు.

లిఫ్ట్ కావాలా అని ఆమెను అడిగాడు. నో ప్రాబ్లం అంటూ ఆమె ముందుకి నడవసాగింది. వాడు ఆమెను వదల్లేదు. ప్రతీ 5, 10 మీటర్లకూ ఆమెకు దగ్గరగా వస్తూ... మిమ్మల్ని డ్రాప్ చెయ్యమంటారా మీ ఇంట్లో. అని అడగసాగాడు. ఆమె క్యాజువల్‌గా నో, నో థాంక్యూ అంటూ కాస్త ఇబ్బంది పడుతూ ముందుకి వెళ్లాసాగింది. అతను అటూ దిక్కులు చూస్తూ... ఎవడూ చూడట్లేదులే అనుకుంటూ ఆమెకు మరింత దగ్గరగా వెళ్లసాగాడు.

కొంత దూరం వెళ్లాక ఆమెకు బైక్‌ని అడ్డుగా పెట్టాడు. ఈసారి కాస్త గంభీరంగా మాట్లాడుతూ... డ్రాప్ చెయ్యనా వద్దా అనడిగాడు. ఆమెకు మండింది. నన్నెందుకు ఫాలో చేస్తున్నావ్. నన్నెవరూ ఫాలో చెయ్యక్కర్లేదు. ఇక్కడ ఉండే హక్కు నాకుంది. నేను ఒంటరిగా నడుస్తూ వెళ్లగలను అని పద్ధతిగా చెప్పింది. అలాగా అంటూ అతను బైకుని వేగంగా ముందుకి నడిపి... ఓ చోట సడెన్‌గా యూటర్న్ తీసుకున్నాడు. వేగంగా ఆమె వైపు వచ్చాడు. ఆమెను చెయ్యి పట్టుకొని దగ్గరకు లాగేసుకున్నాడు. గట్టిగా ముద్దు పెట్టేసుకున్నాడు. ఆమె ఎంత విదిలించుకున్నా... ఎంత గింజుకుంటున్నా... వదల్లేదు. అంతే కాదు... ముద్దు పెట్టుకున్న తర్వాత... ఆమెను చెంపపై గట్టిగా కొట్టాడు. ఆమెను వేలితో బెదిరిస్తూ... వేగంగా పారిపోయాడు.

షాకైన ఇవనోస్కా... ధైర్యం తెచ్చుకొని... పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. బట్... వారమైనా పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదనీ, ఆ కేటుగాణ్ని పట్టుకోవట్లేదనీ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. టూరిస్ట్ ప్లేసైన గోవాలో పోలీసులు ఇంత బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నిస్తోంది ఆమె. ఇదే విషయమై పోలీసుల్ని ప్రశ్నిస్తే... ఎంక్వైరీ చేస్తున్నాం, ఆధారాల కోసం వెతుకుతున్నాం అని కామన్ డైలాగ్స్ చెబుతున్నారు.

మరో వారంలో ఇవనోస్కా... రష్యా వెళ్లిపోతుంది. తన ఫ్రెండ్స్ ద్వారానైనా ఆ కొండెగాడికి శిక్ష పడాలని ఆమె కోరుకుంటోంది. నిజమే ఇలాంటి ఘటనలు మన దేశ పరువు తీసేస్తాయి. విదేశీ పర్యాటకులు ఇండియా రావాలంటే భయపడతారు. మీకు తెలుసా... పదేళ్లలో గోవాలో... 245 మంది విదేశీ పర్యాటకులను రేప్ చేశారు. వాళ్లలో చాలా మందిని చంపేశారు. ఇప్పటికీ ఆ కేసులు మిస్టరీగానే పడివున్నాయి.

 

ఇవి కూడా చదవండి :కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య... రాడ్లు, కర్రలు, బండరాళ్లతో....

Ola Cab : ఓలా ఆఫీస్ ఎదుట క్యాబ్ డ్రైవర్ నగ్న నిరసన...

చంద్రబాబు, జగన్ ఇళ్ల దగ్గర భారీ భద్రత... అసలు కారణం అదేనా...

వైసీపీ విజయం... టీడీపీ ఓటమి... ఆ సర్వే ప్రకారం ఈ ఫలితం
First published: May 22, 2019, 1:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading