• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • RUSSIAN LADY ENDS HER LIFE TO MEET LORD KRISHNA IN UP MATHURA SK

శ్రీకృష్ణుడి కోసం రష్యన్ మహిళ ప్రాణత్యాగం.. దేవుడిని కలుస్తానని ఆత్మహత్య

శ్రీకృష్ణుడి కోసం రష్యన్ మహిళ ప్రాణత్యాగం.. దేవుడిని కలుస్తానని ఆత్మహత్య

ప్రతీకాత్మక చిత్రం

శ్రీకృష్ణుడిని కలవాలని ఆమె కొన్నాళ్లుగా మిత్రులతో చెప్పింది. దేవుడు పదే పదే తనకు కలలో వస్తున్నాడని.. ఎలాగైనా శ్రీకృష్ణ భగవానుడిని కలుస్తానని చెప్పింది. ఈ క్రమంలోనే భవనం పైనుంచి దూకి ఆత్మబలిదానం చేసుకుంది.

  • Share this:
    ఆమె స్వస్థలం రష్యా. కానీ భారతదేశ హిందూ ధర్మం పట్ల ఆసక్తి పెంచుకుంది. శ్రీకృష్ణుడి భక్తిభావం పెంచుకొని..దైవారాధనలో మునిగిపోయింది. ఏడాది క్రితం ఇండియాకు వచ్చి శ్రీకృష్ణుడి జన్మస్థల మథురలో ఉంటోంది. నిత్యం దేవుడిని దర్శించడం.. ఆరాధించడం.. కీర్తనలు వినడం.. ఇదే ఆమె డ్యూటీ. ఐతే శనివారం రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకుంది. తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ మీది నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. శ్రీకృష్ణుడిని కలవాలని ఆమె కొన్నాళ్లుగా మిత్రులతో చెప్పింది. దేవుడు పదే పదే తనకు కలలో వస్తున్నాడని.. ఎలాగైనా శ్రీకృష్ణ భగవానుడిని కలుస్తానని చెప్పింది. ఈ క్రమంలోనే భవనం పైనుంచి దూకి ఆత్మబలిదానం చేసుకుంది.

    పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రష్యాలోని రొస్తోవో పట్టణానికి చెందిన 41 ఏళ్ల తత్యానా హెలోవ్‌స్కయ శ్రీకృష్ణుడి భక్తురాలు. గత ఏడాది ఫిబ్రవరిలో టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చింది. మథురలోని బృందావన్ ధామ్ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తోంది. ఆ భవనాన్ని రష్యన్ బిల్డింగ్‌గా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ చాలా మంది రష్యన్ భక్తులు నివసిస్తారు. తోటి రష్యన్లతో కలివిడిగా ఉండే తత్యానా శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రష్యన్లను అడిగి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. తాను శ్రీకృష్ణుడిని కలవాలనుకుంటోందని.. ఈ క్రమంలోనే ప్రాణత్యాగం చేసి ఉంటుందని ఆమె సహచరులు చెప్పారు.

    తత్యానా మృతిపై పోలీసులు ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రష్యన్ ఎంబసీకి ఈ సమాచారం అందజేశారు. వారు రష్యాలోని కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. ఇక ఈ ఘటన తర్వాత బృందాన్ ధామ్ అపార్ట్‌మెంట్‌కు సీల్ వేశారు. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డుతో పాటు ఇటీవల ఆమెను కలిసిన వారందరినీ విచారిస్తున్నారు. దేవుడిని కలవడం కోసమే.. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఐనప్పటికీ అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు