కొందరు వ్యక్తులు మహిళలు, యువతులు కనిపించగానే కామాంధులుగా మారుతున్నారు. అమ్మాయిలను వేధిస్తు.. అత్యాచారాలకు (Rape one girl) పాల్పడుతున్నారు. అమాయకులపై అఘాయిత్యాలకు పాల్పడుతు వారి పశువాంఛను తీర్చుకుంటున్నారు. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడం లేదు. ఈ మధ్య తరచుగా మహిళలు, యువతులపై అత్యాచార ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. మరో అత్యాచార ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. రష్యాకు (Russia)చెందిన ఒక మహిళ తన కుతూరితో కలసి సరదాగా గడపటానికి గోవాకు (Goa) వెళ్లింది. అప్పుడు టూరిస్ట్ గైడ్ ఆమె కూతురిని అత్యాచారం చేశాడు. గత వారం మే6 జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పోలీసుల ప్రకారం.. రష్యాకు చెందిన మహిళ తన కూతురితో కలసి గోవాకు వెళ్లింది.
అక్కడే ఉన్న ఒక హోటల్ లో బసచేసింది. అక్కడి ప్రదేశాలను చూయించడానికి ఒక రవి లమాని (28) అనే వ్యక్తిని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత.. మహిళ అక్కడే ఉన్న స్విమ్మింగ్ పుల్ (Swimming pool) తన 12 ఏళ్ల కుతురిని విడిచిపెట్టి షాపింగ్ కు వెళ్లింది.
అతగాడు.. బాలికపై కన్నేశాడు. మెల్లగా స్విమ్మింగ్ పుల్ లో దిగాడు. బాలికను వెనక నుంచి అసభ్యంగా తాకాడు. హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారం (Rape on girl) చేశాడు. కాగా, ఘటన జరగ్గానే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక.. జరిగిన దారుణాన్ని ఆలస్యంగా తన వారికి తెలిపింది. వెంటనే వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గత వారంలో జరిగింది. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు గడగ్ ప్రాంతంలో నిందితుడిని అరెస్టు చేశాడు. నిందితుడు కర్ణాటక కు చెందని వాడిగా పోలీసుల విచారణలో తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Goa, Minor rape, Rape case, Russia