గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్..ఆమె మగాడని తెలిసి ముక్కలు ముక్కలుగా నరికాడు..

దర్యాప్తు సమయంలో మిఖైల్ ఇంట్లో తల, వెన్నెముక భాగాలు దొరికాయి. వాటి నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఉప్పు రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ఐతే అతడు నరమాంస భక్షకుడు కాదని..బాడీని వదలించుకునేందుకే అలా చేశాడని చెప్పారు.

news18-telugu
Updated: April 23, 2019, 9:50 PM IST
గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్..ఆమె మగాడని తెలిసి ముక్కలు ముక్కలుగా నరికాడు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 23, 2019, 9:50 PM IST
మరో ప్రేమ కథ రక్తచరిత్రగా మిగిలిపోయింది. అప్పటి వరకు రొమాంటిక్‌గా సాగిన ఆ లవ్ స్టోరీ..చివరకు క్రైమ్ కథాచిత్రంగా ముగిసింది. గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్ చేస్తున్న సమయంలో బాయ్‌ఫ్రెండ్‌కి అసలు విషయం తెలిసి.. ఆమెను కిరాతకంగా చంపేశాడు. ఆమె ఆడ కాదని.. ట్రాన్స్‌జెండర్ అని తెలియడంతో ముక్కలు ముక్కలుగా నరికాడు. రష్యాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. మహిళ కొన్ని రోజులుగా కనిపించకుండా పోవడంతో మిస్సింగ్ కేసునమోదు చేసుకున్న పోలీసులకు..అసలు మర్డర్ కథ తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

27 ఏళ్ల మిఖైల్ టికొనోవ్ రష్యాలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. 25 ఏళ్ల నైనా అనే యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. ఇటీవల నైనా మిఖైల్‌ని కుర్స్క్‌లోని తన ఫ్లాట్‌కు పిలిచింది. ఫ్లాట్‌లో ఇద్దరు మందు తాగుతూ కబుర్లు చెప్పుకొని అనంతరం శృంగారంలో పాల్గొన్నారు. సెక్స్ చేస్తున్న సమయంలో మిఖైల్‌కు నైనాపై అనుమానమొచ్చింది. ఆమె మహిళ కాదని...ట్రాన్స్‌జెండర్ అని తెలియడంతో నిలదీశాడు. ఐతై తాను పూర్తిగా మారిపోయానని.. జెండర్ సర్జరీతో మహిళగా మారిపోయానని చెప్పుకొచ్చింది.

ఆమె ట్రాన్స్‌జెండర్ అని తెలియడంతో మిఖైల్ కోపంతో ఊగిపోయాడు. నిండా మోసపోయానని తెలిసి నైనాను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం బాడీని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. కొన్ని ముక్కలను మైక్రో ఓవెన్‌లో ఉడికించి..మరికొన్నింటినీ బాత్రూమ్‌ టాయిలెట్‌లో పడేసి ఫ్లష్ చేశాడు. ఇక యువతి తల, కాళ్లు, చేతులను తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి కొబ్బరి తురుములా తరిమేశాడు. ఆ మాంసం తరుమును కొంచెం కొంచెంగా తీసుకెళ్లి చెత్త కుప్పల్లో విసిరేశాడు. అలా నైనా మృతభాగాలను వదిలించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేశాడు.

నైనా కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాల్ డేటా ఆధారంగా మైఖేల్‌ని విచారించారు. దర్యాప్తు సమయంలో మిఖైల్ ఇంట్లో తల, వెన్నెముక భాగాలు దొరికాయి. వాటి నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఉప్పు రాసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఐతే అతడు నరమాంస భక్షకుడు కాదని..బాడీని వదలించుకునేందుకే అలా చేశాడని చెప్పారు. ఓవెన్‌లో ఉడికించిన భాగాలను కూడా మళ్లీ బాత్రూమ్ టాయిలెట్‌లో ఫ్లష్ చేశాడని పేర్కొన్నారు. టాయిలెట్‌లో కొంచెం కొంచెంగా పడేసేవాడని..మిగిలిన మాంసం కుళ్లిపోకుండా ఉండేందుకే ఓవెన్‌లో ఫ్రై చేశాడని తెలిపారు. కొన్ని రోజులు పాటు ఈ తతంతగమంతా జరిగిందని చెప్పారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో మిఖైల్‌కు 20 ఏళ్ల జైలు శిక్షపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...