హోమ్ /వార్తలు /క్రైమ్ /

Ukraine: అరాచకం... ఉక్రెయిన్ లో పురుషులు, బాలలపై కూడా అత్యాచారాలు.. బయటపడుతున్న రష్యన్ సైనికుల దారుణాలు..

Ukraine: అరాచకం... ఉక్రెయిన్ లో పురుషులు, బాలలపై కూడా అత్యాచారాలు.. బయటపడుతున్న రష్యన్ సైనికుల దారుణాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Russia ukraine war: రెండు నెలలకు పైగా ఉక్రెయిన్ పై రష్యన్ సైనికులు దాడులకు పాల్పడుతున్నారు.  ప్రస్తుతం అక్కడ జరుగుతున్న దారుణ ఘటనలు వెలుగులోనికి వస్తున్నాయి.

ప్రపంచ దేశాల మాటలను ఏమాత్రం లెక్కచేయకుండా పుతిన్ (Vladimir putin), ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అక్కడి ప్రధాన నగరాలు తమ రూపు రేఖలను కొల్పోయాయి. విమానాలు, బాంబులతో రష్యన్ సైనికులు విరుచుకుపడుతున్నారు. దీంతో ఇప్పటికే లక్షలాది మంది ఉక్రెయిన్ (Ukraine war)  ప్రజలు అక్కడి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. మరికొంత మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటు కాలం వెల్లదీస్తున్నారు. ఇక అక్కడ అనేక నగరాలలో శవాలు గుట్టలు గుట్టలుగా మారాయి. దీంతో అక్కడ భయానక పరిస్థితి ఏర్పడింది.

ఇంకా రష్యా సైనికులు.. (Russia soliders) అక్కడి మహిళలు, యువతులపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. గతంలో అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. గతంతో ఒక ఇంట్లో ప్రవేశించిన రష్యన్ సైనికుడు తనకు .. లొంగకపోతే.. మరో 20 మందిని పిలిచి అత్యాచారం (Rape on Ukraine girls)  చేయిస్తానని చెప్పాడని బాధిత యువతి వాపోయింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఇక ఐక్యరాజ్యసమితి (Uno) అధికారులు కూడా అక్కడ పర్యటించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్ తన యుద్దోన్మోదాన్ని విడిచిపెట్టాలని సూచించారు. తాజాగా, అక్కడ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి ప్రమీల పాటెల్ (Pramila Patten) ఉక్రెయిన్ లో పర్యటించారు.

ఆమె పర్యటనలో పలు షాకింగ్ విషయాలు (Shocking insudents) వెలుగులోనికి వచ్చాయని తెలిపారు. ఆమె ఉక్రెయిన్ ఉపప్రధాని ఓల్గా స్టెఫానిష్నినాతో సమావేశంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్ లో మహిళలు, యువతులనే తోపాటు.. పురుషులు, బాలురను కూడా రష్యన్ సైనికులు (Russia soldiers rapes Woman)  అత్యాచారం చేస్తున్న ఘటనలు బయటపడ్డాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలతో ప్రపంచమంతా రష్యాను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Rape on girl, Rape on women, Russia, Russia-Ukraine War, Vladimir Putin

ఉత్తమ కథలు