Bomb Attack On Ukraine School : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం(Russia-Ukraine War)కొనసాగుతోంది. రెండు నెలల నుంచి ఉక్రెయిన్ పై...రష్యా బలగాలు బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ తూర్పు భాగంలోని లుహాన్సక్ ప్రాంతంలో భీకర దాడులు చేపట్టాయి. ఈ క్రమంలో లుహాన్సక్లోని బిలోహోర్వికా గ్రామంలోని పాఠశాలపై రష్యా బలగాలు శనివారం మధ్యాహ్నాం బాంబు దాడి జరిపాయి. ఈ ఘటనలో 60 మంది మరణించారు. ఘటన జరిగిన సమయంలో స్కూల్ బిల్డింగ్ లో 90 మంది ఉన్నారని.. 30 మందిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగిన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. . బాంబు దాడితో స్కూల్(ussian Bomb Hits Ukraine School)పూర్తిగా నేలమట్టమైందన్నారు. దాదాపు 4 గంటలు శ్రమిస్తేనే కానీ అగ్నికీలలు అదుపులోకి రాలేదన్నారు.
ఈ విషాద ఘటనపై లుహాన్సక్ గవర్నర్ సెర్హీ గైడాయ్ స్పందించారు. రష్యాకు చెందిన విమానం ఈ భవనంపై బాంబు జార విడిచిందని గవర్నర్ చెప్పారు. దాడికి గురైన పాఠశాల సరిహద్దులకు కేవలం ఏడు మైళ్ల దూరంలో ఉందన్నారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని,అనంతరం దాదాపు నాలుగు గంటలపాటు అగ్నికీలలు ఎగసిపడ్డాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ దాడిపై ఇంకా రష్యా స్పందించాల్సి ఉంది.
ఇక,ఉక్రెయిన్ లోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా సేనలు దాడులు ముమ్మరం చేశాయి. కాగా, రష్యా సైన్యం ఉక్రెయిన్ లోని సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని ఉక్రెయిన్ ప్రభుత్వంతో పాటు, పాశ్చాత్య దేశాలు కూడా ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను రష్యా కొట్టిపారేస్తోంది. రష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తున్న పలు దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలుస్తున్నాయి. పెద్ద మొత్తం ఆర్థిక, ఆయుధ సామాగ్రి సాయం చేస్తున్నాయి. తాజాగా బ్రిటన్ నుంచి ఉక్రెయిన్ కు మరో రూ.12వేల 344 కోట్లు) సైనిక సాయం అందనుంది. ఈ విషయాన్ని బ్రిటన్ ట్రెజరీ విభాగం ఆదివారం వెల్లడించింది. వర్చువల్ జీ-7 సదస్సుకు ముందు ఈ సాయం ప్రకటించారు. అఫ్ఘానిస్తాన్, ఇరాక్ యుద్ధం తర్వాత బ్రిటన్ ఈ స్థాయిలో కేటాయింపులు చేయడం ఇదే తొలిసారి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia-Ukraine War, School, Ukraine