హోమ్ /వార్తలు /క్రైమ్ /

రష్యాలో దారుణం...యూట్యూబ్‌లో ఓడ్కా చాలెంజ్‌...డోస్ ఎక్కువై వృద్ధడు లైవ్ లో మృతి...

రష్యాలో దారుణం...యూట్యూబ్‌లో ఓడ్కా చాలెంజ్‌...డోస్ ఎక్కువై వృద్ధడు లైవ్ లో మృతి...

మద్యం బాటిల్​ (ఫైల్​)

మద్యం బాటిల్​ (ఫైల్​)

తాజా కేసులో, వోడ్కా తాగుతూ 60 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. సదరు మృతి చెందిన వ్యక్తి 1.5 లీటర్ల వోడ్కా తాగే సవాలును నిజం చేస్తూ డోస్ ఎక్కువై మరణించాడు.

  రష్యాలో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. వార్తల ప్రకారం, ఇలాంటి కేసులు సోషల్ మీడియాలో ఈమధ్య కాలంలో నిరంతరం వస్తున్నాయి, దీనివల్ల అటు ప్రభుత్వ పరంగానూ, అటు స్థానికంగానూ సమస్యలు పెరిగాయి. తాజా కేసులో, వోడ్కా తాగుతూ 60 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. సదరు మృతి చెందిన వ్యక్తి 1.5 లీటర్ల వోడ్కా తాగే సవాలును నిజం చేస్తూ డోస్ ఎక్కువై మరణించాడు. వివరాల్లోకి వెళితే రష్యాలోని స్మోలెన్స్క్‌లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది, స్థానిక మీడియా ప్రకారం, మరణించిన వ్యక్తిని యూరి దుషెచ్కిన్‌ గా గుర్తించారు. ఓ యూట్యూబర్ లైవ్‌లో వోడ్కా తాగమని లేదా వేడి సాస్ తినమని సవాలు చేసింది. రష్యా స్థానిక మీడియా ప్రకారం ప్రత్యక్ష ప్రసారంలో ఓ మనిషి చనిపోతుంటే ఈ దృశ్యాన్ని ప్రేక్షకులు చూస్తూ లైక్ కొట్టడం గమనార్హం.

  ఇంటర్నెట్లో భయంకరమైన ధోరణి 'త్రాష్ స్ట్రీమ్'

  రష్యా లో ఈ సంఘటనను ఇంటర్నెట్‌లో 'త్రాష్ స్ట్రీమ్' అనే ఘోరమైన ధోరణిలో భాగంగా పరిగణించబడుతుంది. దీనిని 'ట్రాష్ స్ట్రీమ్' అని కూడా అంటారు. ఈ సమయంలో ప్రజలను బహిరంగంగా  ఆశ్చర్యకరమైన లేదా దారుణమైన విన్యాసాలు చేయమని కోరతారు. దీన్ని చేసేవారికి బదులుగా పెద్ద మొత్తాన్ని బహుమతిగా కూడా అందిస్తారు.

  రష్యాలో ఇటువంటి సంఘటనలను నిషేధించాలని డిమాండ్ చేశారు

  దేశంలో ఇలాంటి అనేక కేసులు కనిపించిన తరువాత, ఈ ధోరణిని నిషేధించాలన్న డిమాండ్ ఊపందుకుంది. ప్రస్తుతం, రష్యన్ సెనేటర్ అలెక్సీ పుష్కోవ్ వోడ్కా తాగడం వల్ల మరణించిన ఈ సంఘటనపై స్ట్రీమింగ్ నిషేధించాలని డిమాండ్ చేశారు. త్వరలో ఈ ధోరణిని కౌన్సిల్ సమావేశంలో చట్టవిరుద్ధంగా ప్రకటిస్తామని చెప్పారు.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Crime, Wine shops

  ఉత్తమ కథలు