అంధుడైన కొడుకుకు పింఛన్ ఇప్పించమంటే పక్కలో పడుకోమన్నాడు.. అధికార పార్టీ నాయకుడి బాగోతం

ప్రతీకాత్మకచిత్రం

తన అంధుడైన కుమారుడికి వికలాంగుల పింఛన్ ఇప్పించాలని ఆ మహిళ సదరు నాయకుడిని ప్రాధేయపడింది. అయితే ఆ నాయకుడు ఆ దళిత మహిళ పై కన్నేశాడు. పింఛన్ ఇప్పించాలంటే తన కామవాంఛ తీర్చాలని తన మనసులో మాట బయటపెట్టాడు.

 • News18
 • Last Updated :
 • Share this:
  అధికారం చేతిలో ఉంది కదా అని తమ ఇష్టం వచ్చినట్లు పేద ప్రజల మాన ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు కొంతమంది అధికార పార్టీ నాయకులు. ఇలాంటి ‘గ్రామ సింహా’ల బాగోతం వర్ణనాతీతం. మొన్నీమధ్య ఓ అధికార పార్టీ గ్రామ నాయకుడు ఓ మహిళను లైంగికంగా వేధించిన ఘటన మరువకముందే మరో సంఘటన అదే మండలంలో చోటు చేసుకోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుందీ ఘటన. ఆ నాయకుడు తనను వేధిస్తున్నాడని గ్రామ పెద్దలతో చెప్పుకున్నా ఆమెకు న్యాయం జరగలేదు. చివరికి పోలీసులు కూడా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నారు.

  గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఒకరు తన కామ వాంఛ తీర్చాలని సదరు దళిత మహిళను కోరాడు. తన అంధుడైన కుమారుడికి వికలాంగుల పింఛన్ ఇప్పించాలని ఆ మహిళ సదరు నాయకుడిని ప్రాధేయపడింది. అయితే ఆ నాయకుడు ఆ దళిత మహిళ పై కన్నేశాడు. పింఛన్ ఇప్పించాలంటే తన కామవాంఛ తీర్చాలని తన మనసులో మాట బయటపెట్టాడు. తన వద్ద పడుకుంటేనే కుమారుడికి పింఛన్ ఇప్పిస్తానని ఆఫర్ ఇచ్చాడు.

  ఆమె పలుమార్లు అడిగినా ఆ నాయకుడి నుంచి ఇదే సమాధానం వచ్చింది. అయితే సహనం కోల్పోయిన ఆ మహిళ.. ఈ వ్యవహారం గురించి ఊరి పెద్దల దగ్గర చెప్పుకుని వాపోయింది. తనకు న్యాయం చేయాలని వారిని కోరింది. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని పంచాయతీ పెట్టారు. అంతకుముందే.. ఎనిమిది వేల రూపాయలు ఇస్తాం సంఘటన మర్చిపోవాలని చెప్పారు ఆ నాయకుని అనుయాయులు. దళిత మహిళపై సదరు అధికార పార్టీ నాయకుడి భార్య దాడి కూడా చేసింది. దీంతో గ్రామ పెద్దలు కూడా ఆ నాయకుడి తొత్తులే అని గమనించిన మహిళ.. తనకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది.

  పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని నాన్చుతూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు అందజేస్తున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలు వారికి నిజాయితీగా అందాలంటే ఇలాంటి "గ్రామ సింహాల" పని పట్టాల్సిందేనని గ్రామంలోని ప్రజలు అంటున్నారు. ఆ అధికార పార్టీ నాయకుడు తన కామవాంఛను తీర్చమని కోరడం దుర్మార్గమైన చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా మహిళపై దాడి చేసి అక్రమ సంబంధం అంటగడుతూ ఉన్నారని విమర్శలు బయలుదేరాయి. పేద మహిళల మానంతో ఆడుకుంటున్న సదరు కీచకుల భరతం పట్టాల్సిన సమయం ఆసన్నమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
  Published by:Srinivas Munigala
  First published: