మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపోలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డ్రైవర్, కండక్టర్ మీద ఆర్టీసీ కార్మికులు దాడి చేశారు. డ్యూటీకి వెళ్తున్న వారిని అడ్డుకున్నారు. వారి మీద దాడి చేశారు. అయితే, ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. డ్రైవర్, కండక్టర్‌కు పోలీసులు భద్రత కల్పించారు. దాడికి గురైనవారు తాత్కాలిక డ్రైవర్, కండక్టర్‌గా తెలుస్తోంది. ఆర్టీసీలో కార్మికులు సమ్మె ప్రారంభించిన తర్వాత అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు గత నెల రోజులుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా ఆర్టీసీ డిపోలో నుంచి బస్సులను బయటకురానివ్వకుండా కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో బస్సును బయటకు తీసుకొచ్చేందుకు డ్రైవర్, కండక్టర్ ప్రయత్నించడంతో వారిపై కార్మికులు దాడి చేసినట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahbubnagar, RTC Strike, Telangana, TSRTC Strike