హోమ్ /వార్తలు /క్రైమ్ /

Road Accident: పండగ పూట విషాదం.. వేర్వేరు ప్రదేశాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..

Road Accident: పండగ పూట విషాదం.. వేర్వేరు ప్రదేశాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..

ఘటనా ప్రదేశం వద్ద ప్రమాదానికి గురైన బస్సు

ఘటనా ప్రదేశం వద్ద ప్రమాదానికి గురైన బస్సు

Road Accident: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటిక్యాల మండలం ధర్మవరం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. మరో ఘటనలో 10 మందికి గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ(Telangana)లోని జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లాలో రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. హైద‌రాబాద్ నుంచి క‌ర్నూల్(Kurnool) వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సు(RTC Bus).. జాతీయ ర‌హ‌దారి 44పై బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 20 మంది ప్ర‌యాణికులు(Passengers) గాయ‌ప‌డ్డారు. కొంతమందికి తీవ్ర గాయాలైనట్లు పేర్కొంటున్నారు. ప్రమాదం సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు హైదరాబాద్‌(Hyderabad) నుంచి కర్నూలు వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Shocking Incident: చెప్పేవి నీతులు.. చేసివి నీచపనులు.. అక్కాచెల్లెళ్లు ఉన్న ఇంటికి వెళ్లి ఈ కానిస్టేబుల్..


క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. వీరిలో కొద్దీ మందికి తలపై తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజు క్రితం జనగామ జిల్లా చిల్పూర్ మండలం కొండాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు 10 మంది ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి.

Cab Driver: క్యాబ్ రైడ్ క్యాన్సిల్ చేసిన మహిళ.. కోపంతో ఆ డ్రైవర్ ఏ చేశాడో తెలుసా..


హుస్నాబాద్(Husnabad) నుంచి జగద్గిరిగుట్ట వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ప్రమాద సమయంలో డ్రైవర్, కండక్టర్ సహా 10 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ బస్సులు ఇలా రోడ్డు ప్రమాదాలకు గువుతుండటంతో ప్రయాణికులు భయాందోళకు గురవుతున్నారు. ఇటువంటివి మున్ముందు జరగకుండ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Pregnant Women: రైల్వే స్టేషన్ వద్ద నొప్పులతో గర్భిణి.. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది..


బంతిపూల కోసం వెళ్లి..

ఇదిలా ఉండగా మరో రోడ్డు ప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి.. వివరాల్లోకి వెళ్తే.. బంతిపూలు కోసేందుకు వెళ్తున్న కూలీల ఆటోను వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న10మంది కూలీలు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన కొణిజర్ల మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై మాచినేని రవి తెలిపిన ప్రకారం.. పల్లిపాడుకు చెందిన రాచబంటి విశ్వనాథం అనే వ్యక్తి తన సొంత ఆటోలో తాను సాగుచేస్తున్న బంతిపంటలో పూలు కోసేందుకు కూలీలను ఎక్కించుకొని బయల్దేరాడు.

పండుగ సందర్భంగా వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. వాటిని విక్రయించేందుకు ఇలా పంటపొలానికి సమీపంలో వెనుక నుంచి వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. గాయాలపాలైన బాధితులను చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఎవరకీ ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

First published:

Tags: Bus accident, Telangana

ఉత్తమ కథలు